సినిమా ఇండస్ట్రీ లో నటుడు గా ... దర్శకుడి గా ... కొరియో గ్రాఫర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే డాన్స్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపును తెచ్చుకొని ఆ తర్వాత నటుడిగా ... దర్శకుడుగా మంచు గుర్తింపును తెచ్చుకున్న లారెన్స్ ప్రస్తుతం మాత్రం ఎక్కువ శాతం నటుడిగా సినిమాల్లో నటించడానికి ... దర్శకుడుగా సినిమాలకు దర్శకత్వం వహించడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. 

అందులో భాగంగా తాజాగా లారెన్స్ ... కతరేశణ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా అయినటు వంటి రుద్రన్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ సినిమాని రుద్రుడు అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని తెలుగు వర్షన్ ప్రచార చిత్రాలను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది. ఏప్రిల్ 10 వ తేదీన సోమవారం రోజున సాయంత్రం 6 గంటలకు పార్క్ హయత్ ... బంజారాహిల్స్ ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా ఉంటే రుద్రుడు మూవీ తో లారెన్స్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: