దసరా’ తరువాత బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన సినిమాలు ఏమీ లేవు. రెండువారాల తరువాత ఈవారం మూడు డిఫరెంట్ సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే ఈ మూడింటి పై కూడ సగటు ప్రేక్షకుడుకి పెద్దగా ఆశక్తిలేకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సమంత క్రేజ్ ను నమ్ముకుని గుణశేఖర్ భారీ బడ్జెట్ తో తీసిన ‘శాకుంతలం’ ఈరోజు విడుదల కాబోతోంది.


మూవీ వెనుక దిల్ రాజ్ హస్తం ఉన్నప్పటికీ ఈ మూవీకి అత్యంత భారీ స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చినప్పటికీ ఈమూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకు పెద్దగా స్పందన లేకపోవడం శాకుంతలం టీమ్ ను కలవర పెడుతున్నట్లు టాక్. ఈ మూవీ బయ్యర్లు టెన్షన్ లో ఉన్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ విడుదల తరువాత వచ్చే పాజిటివ్ టాక్ తో కలక్షన్స్ ఊపు అందుకుంటాయని దిల్ రాజ్ చాల నమ్మకంతో ఉన్నాడు అని అంటున్నారు.


అయితే ఈ సినిమాకు సంబంధించి గత సోమవారం జరిగిన ప్రీమియర్ షో తప్ప మిగతా రోజులలో వేయవలసిన ప్రీమియర్ షోలను ఎందుకు క్యాన్సిల్ చేసారు అంటూ అనేక గాస్పిప్పుల హడావిడి ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతోంది. ఇక ఈసినిమాకు పోటీగా విడుదల అవుతున్న మిగతా రెండు సినిమాల పరిస్థితి కూడ ఏమాత్రం బాగాలేదు అని అంటున్నారు. లారెన్స్ ‘రుద్రుడు’ పై కూడ ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ఈసినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి.


ఇక చివరిగా అల్లు అరవింద్ గాడ్ ఫాదర్ గా మారి విడుదలచేస్తున్న ‘విడుదల పార్ట్ 1’ పై కూడ అంచనాలు లేవు. అయితే తమిళ దర్శకుడు వెట్రిమారన్ మాత్రం తమ సినిమా ‘కాంతారా’ రేంజ్ లో బ్లాక్ బష్టర్ హిట్ అవుతుందన్న అంచనాలతో ఉన్నాడు. కనీసం ఈ మూడు సినిమాలు మొదటి మూడురోజుల కలక్షన్స్ ను కూడ తెచ్చుకోలేకపోతే ఈవారం కూడ బాక్సాఫీస్ డల్ గా కొనసాగే ఆస్కారం ఉంది అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: