‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ తన భవిష్యత్ సినిమాల ఎంపిక పై మరింత శ్రద్ధ చూపించడమే కాకుండా తన ఇమేజ్ ని బాలీవుడ్ లో అదేవిధంగా హాలీవుడ్ లో పెంచుకోవడానికి అనేక వ్యూహాలు అనుసరిస్తున్నాడు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదలకాబోతున్న శంకర్ మూవీ ‘గేమ్ చేంజర్’ తో తన రేంజ్ మరింత పెరుగుతుందని చరణ్ అంచనాలు వేసుకుంటున్నాడు.


ఒకవైపు పాన్ ఇండియా హీరోగా సెటిల్ కావడానికి తన ప్రయత్నాలు అన్నీ కొనసాగిస్తూనే మరొకవైపు తమ కుటుంబ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రవేట్ జెట్ బిజినెస్ లో ఎంటర్ అయిన చరణ్ ఆవ్యాపారంలో చెప్పుకోతగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు అని అంటారు. ఇప్పుడు చరణ్ మనసులో ఒక కొత్త బిజినెస్ ప్లాన్ ఆలోచనలు వచ్చాయని అంటున్నారు.


తెలుస్తున్న సమాచారంమేరకు చరణ్ వచ్చే సంవత్సరం నుండి ఐపిఎల్ ఫ్రాంచైజ్ ఓనర్ గా మారుతాడని టాక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ప్రతినిథిగా కేవలం సన్ రైజర్స్ మాత్రమే ఉంది. ఇది హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకగా అభిమానులు భావించి దానికి తెలంగాణ సెంటిమెంట్ జోడిస్తున్నారు. అయితే ఈ ఐపీఎస్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడంతో చరణ్ ఆదిశగా ఆలోచించి వచ్చే ఏడాది 2024లో జరగబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీలో వైజాగ్ పేరుతో ఒక ఫ్రాంచైజ్ ని లాంచ్ చేసే ఆలోచనలలో ఉన్నాడట.


ఈప్రతిపాదనకు ఈ టోర్నమెంట్ నిర్వాహకులు అంగీకరిస్తే ఆ టీమ్ ను సొంతం చేసుకోవడానికి చరణ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టీమ్ ను చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇప్పటికే షారుఖ్ ఖాన్ ప్రీతి జింతా లాంటి వాళ్ళు ఐపిఎల్ టీమ్ లను సొంతం చేసుకున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి వ్యాపారంలోకి ఎంటర్ అవుతున్న రికార్డు చరణ్ కు దక్కే ఆస్కారం కనిపిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: