భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.టాలీవుడ్‌లో మొదటి ఛాన్సే పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం రావడంతో అమ్మడుకు అదృష్టం బాగా కలిసొచ్చింది. అంతేకాకుండా ఈ మూవీ సక్సెస్ కావడంతో ఇక్కడ వరుస పెట్టి అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఇప్పటికే బింబిసార, సార్ లాంటి సినిమాలతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. తాజాగా సాయి ధరమ్ తేజ్‌తో కలిసి చేసిన విరూపాక్షతోనూ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సంయుక్తను గోల్డెన్ లెగ్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ అంశంపై సంయుక్త కూడా స్పందించారు.

"ఈ గోల్డెన్ లెగ్ కాన్సెప్టే అసలు మంచిది కాదు. ఓ హీరోయిన్ గోల్డెన్ లేదా ఐరన్ లెగ్ అనడంలో అర్థం లేదు. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. ఇలా అనడం వల్ల మమ్మల్ని తక్కువ చేసినట్లువుతుంది. సక్సెస్ సాధిస్తే మేము లక్కీ అని కాదు. సినిమా వెనక ఎంతో కష్టముంటుంది. సరైన స్క్రిప్టులను ఎంచుకుని మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తేనే విజయం వరిస్తుంది. సక్సెస్ వీటిపైనే ఆధారపడుతుందని నేను అనుకుంటా." అని సంయుక్త స్పష్టం చేశారు.

ఈ పాత చింతకాయ పచ్చడి లాంటి కాన్సెప్టును పక్కనబెట్టాలని సంయుక్తం సూచించారు. "గోల్డెన్ లేదా ఐరన్ లెగ్ అంటూ పాటించే ఈ పాతకాలపు కాన్సెప్టును పక్కనబెట్టండి. లక్కీ అని హీరోయిన్‌ను తీసుకోరు. సూటబుల్ క్యారెక్టర్ అనుకుంటే క్యాస్టింగ్ చేస్తారు." అని సంయుక్తం స్పష్టం చేశారు. ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాటాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సంయుక్తపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. సుకుమార్ ఈ చిత్రానికి స్కీన్ ప్లే అందించారు. కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: