తమిళ సినిమాల ద్వారా మంచు గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ నటుడు తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో డాక్టర్ వరుణ్ ... కాలేజ్ డాన్ ... ప్రిన్స్ మూవీ లు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

ఈ మూడు మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో శివ కార్తికేయన్ క్రేజ్ ఒక్క సారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు మా వీరన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో ఆగస్టు 11 వ తేదీనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడడంతో శివ కార్తికేయన్ తన తదుపరి మూవీ పై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా తాజాగా ఈ హీరో తదుపరి మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ హీరో తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ఈ రోజు ఉదయం 11 గంటలకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శివ కార్తికేయన్ తదుపరి మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: