సినిమాలలో రాజకీయాలలో వ్యాపార రంగంలో ఎవరికి ఎప్పుడు కాలం కలిసివస్తుందో తెలియదు. అందువల్లనే ఆ కలిసి వచ్చే కాలం కోసం చాలామంది ఆశగా ఎదురు చూస్తారు. ఇప్పుడు అలాంటి అదృష్టం ఆదాశర్మ కు వచ్చింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆదాశర్మ ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆమెకు ఇంకా బ్రేక్ రాలేదు.


‘హార్ట్ ఎటాక్’ ‘క్షణం’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘కల్కి’ లాంటి చాల సినిమాలలో ఆమె నటించినప్పటికీ ఆమెకు ఎటువంటి గుర్తింపు కలగలేదు. దీనితో ఆమె యూటర్న్ తీసుకుని తిరిగి బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ సినిమాలు చేస్తున్నప్పటికీ అక్కడ కూడ ఆమెకు దశ తిరగలేదు. దీనితో ఆమె సోషల్ మీడియాను నమ్ముకుని అక్కడ యాక్టివ్ గా ఉంటూ ఫిట్నెస్ కు సంబంధించిన అనేక వీడియోలు పోస్ట్ చేస్తూ ఆమె నేటితరం వారితో తన కనెక్షన్ కొనసాగిస్తోంది.


లేటెస్ట్ గా విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న ‘ది కేరళా స్టోరీ’ మూవీలో ఆమె కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలోని ఆమె పాత్రకు మంచి ప్రశంసలు కూడ లభిస్తున్నాయి. ఈ మూవీ పై వివాదాస్పద టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ కలక్షన్స్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కూడ చాల బాగున్నాయి. ఈ వీకెండ్ కు ‘ఉగ్రం’ మూవీ కంటే ‘ది కేరళా స్టోరీ’ మూవీకి కలక్షన్స్ బాగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు తమకు నచ్చితే చాలు ఏ భాష సినిమా అయినా ఆదరిస్తారు అన్న విషయం మరొకసారి రుజువైంది.


ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ పాత్రను అయినా నటించగల హీరోయిన్స్ కొరత చాల ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆదాశర్మ కు దశ తిరిగింది కాబట్టి ఆమెకు అవకాశాలు వస్తాయి అనుకోవాలి. అయితే నేటితరం హీరోలు చాలామంది కొత్త హీరోయిన్స్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులలో ఆదాశర్మ కు ఎంతవరకు లక్ కలిసి వస్తుంది అన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది..




మరింత సమాచారం తెలుసుకోండి: