చిత్ర పరిశ్రమలో ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలన్నీ విడుదల అవుతున్నాయి.. కరోనా సమయంలో అలవాటు అయిన ఒటిటి ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది..

మంచి కంటెంట్ తో సినిమా వస్తే ఆడియెన్స్ కు అది ఆ భాషకు సంబంధించిన డబ్బింగ్ మూవీ అయినా కూడా బాగా చూసేస్తున్నారు.మరి తాజాగా మలయాళ డబ్బింగ్ మూవీ ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో బాగా ఆకట్టు కుంటుంది.. గత ఏడాది విడుదల అయిన పథోంపథం నూట్టండు అనే యాక్షన్ పెరియాడికల్ మూవీ ఇప్పుడు తెలుగులో ''పులి 19వ శతాబ్దం'' పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి కంటెంట్ బేస్ తో రావడంతో తెలుగు ఆడియెన్స్ ను కూడా బాగా అలరిస్తుంది.

ప్రైమ్ వీడియోలో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ సినిమాకే హైలెట్ గా నిలిచి ఆడియన్స్ ను ఆకట్టు కుంటుంది.. 19వ శతాబ్దంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో జరిగే దొంగతనం, ఆ దొంగను పట్టుకునే పాయింట్ తో తెరకెక్కడంతో అప్పట్లోనే విమర్శకుల ప్రశంసలు కూడ అందుకుంది. ఇక ఇప్పుడు కూడా ఆకట్టు కుంటున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఈ సినిమా ఇప్పుడు ఓటిటీ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఆదరిస్తారు అని ఈ సినిమా మరోసారి నిరూపించబడింది.. అందుకే కంటెంట్ బేస్ సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి ఇప్పుడు ఓటిటీలో దుమ్ము రేపుతున్నాయి.ఒక్క మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలే కాదు కన్నడ అలాగే తమిళ్ మరియు హిందీ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమాలు కంటెంట్ బాగుంటే ఎంత పెద్ద హిట్ చేస్తారో చెప్పలేము. ఈ మధ్యనే వచ్చిన కాంతారా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఉదాహరణంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: