జూన్ మూడవ వారంలో విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్ ను తారా స్థాయికి తీసుకు వెళ్ళడానికి పక్కా ప్లాన్ తో ఈ సినిమా నిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. ‘జై శ్రీరామ్’ నినాదంతో దేశవ్యాప్తంగా ఈసినిమాను ప్రమోట్ చేయడానికి దేశంలోని కొన్ని శ్రీరాముడి ఆలయాలను తమ కార్య స్థానంగా మార్చుకుని ఈసినిమాను చాల విభిన్న రీతిలో ప్రమోట్ చేయబోతున్నారు.

 

 
అయోధ్య భద్రాచలం ఆలయాలతో పాటు మరికొన్ని శ్రీరాముడి ఆలయాలలో ఈసినిమా ప్రమోషన్ ను పూర్తి భక్తి శ్రద్ధతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమోషన్ లో ఈసినిమా యూనిట్ అంతా తిరుగుతూ దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేయబోతున్నారు. జూన్ నెలకు సంబంధించిన మొదటి రెండు వరాలు ‘జై శ్రీరామ్ నినాదం మాత్రమే అందరికీ వినిపించేలా ‘ఆదిపురుష్’ టీమ్ హోరెత్తించబోతున్నారు.

 

 
మూవీ ట్రైలర్ కు విపరీతమైన స్పందన వస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ‘జై శ్రీరామ్’ పాటకు విపరీతమైన స్పందనతో పాటు లైకులు కూడ వస్తున్నాయి. అతుల్ అజయ్ కంపోజింగ్ లో వచ్చిన ఈ తెలుగు వెర్షన్ పాటకు రామజోగయ్య శాస్త్రి అందించిన పద సాహిత్యం చాల బాగుంది అని మెచ్చుకుంటున్నారు. రఘురాముడి గుణగణాలను వర్ణిస్తూనే ఆయన అభయం ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందో వర్ణించిన తీరు చాలామందికి నచ్చింది. శ్రీరామ నవమితో పాటు ఇకపై ఆ దేవుడికి సంబంధించిన ఏసందర్భంలో అయినా ఉపయోగించుకునేలా ‘జై శ్రీరామ్’ ట్యూన్ చేసిన విధానం అందరికీ విపరీతంగా నచ్చింది.

 

 ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను 5వేల ధియేటర్లలో విడుదల చేస్తున్న పరిస్థితులలో ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా మొదటివారంలోనే ఐదు వందల కోట్ల గ్రాస్ కలక్షన్స్ ఈమూవీ తెచ్చుకుని అన్నీ అనుకూలిస్తే రెండవ వారం పూర్తి అయ్యేసరికి 1000 కోట్ల సినిమాగా మారడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాలలోని కొందరు వేస్తున్న అంచనాలు ప్రభాస్ అభిమానులకు మరింత జోష్ ను ఇస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: