'కే జి ఎఫ్ 2' సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతటి సంచలనాలను సృష్టించిన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు సలార్ సినిమాసినిమా కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శృతిహాసన్. కిన్స్ ఫిలిం ఫెస్టివల్ లో యాక్టివేటింగ్ చేంజ్ పానెల్ గెస్ట్ ఆఫ్ హానర్ గా హాజరైంది శృతిహాసన్. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో లింగ భేదాల గురించి మాట్లాడింది. ఇందులో భాగంగా తన నెక్స్ట్ సినిమా అయినా సలార్ సినిమాపై కూడా స్పందించింది.ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గురించి మాట్లాడింది శృతిహాసన్..

 ప్రశాంత్  ఇంతకుముందు సినిమా మీరందరూ చూసే ఉంటారు.. హీరో ఉన్నాడు అతని స్టోరీ ఉంది కానీ దాని చుట్టూ ఉండేదే ఆ పాత్రను స్టోరీని నిర్మిస్తుంది.. అందులో ప్రతి ఒక్కరికి తవదైన స్పేస్ ఉంటుంది.. అని చెప్పుకొచ్చింది శృతిహాసన్. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి అని అనుకుని ప్రశాంత్  ఒక కొత్త ప్రపంచాన్ని పాత్రను క్రియేట్ చేస్తాడని చెప్పుకొచ్చింది.. కే జి ఎఫ్ 2 లో మరిచిపోయిన ఓ తండ్రికి కూడా స్టోరీలో చోటు కల్పించడం నాకు చాలా నచ్చింది ..ఇలాంటి కొత్త కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు ప్రశాంత్ ..అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆయన సినిమాలో ఉంటాయి ..ఇక సలార్లో కూడా ఇలాంటివే ఉంటాయి.. కె జి ఎఫ్ కి సినిమాకు మించేలా ఈ సినిమాలో ఉంతుంది అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. 

అంతే కాకుండా సలార్ సినిమాలో నటించడానికి తాను చాలా ఎంజాయ్ చేసినట్లుగా కూడా స్పష్టం చేసింది. సలార్ విషయంలో ప్రశాంత్ సార్ ప్రభాస్ లకు నేను ఈ క్రెడిట్ మొత్తం ఇస్తాను.. వాళ్ళ ప్రతి ఒక్క సలహాలను నేను స్వీకరిస్తాను.. వాళ్లతో నేను చాలా ఓపెన్ గా మాట్లాడతాను.. అంటూ వెల్లడించింది శృతిహాసన్.  ఇక సలార్ సినిమా భారీ బడ్జెట్ సినిమా రాబోతుంది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కాబోతుంది. ప్రశాంత్ కే జి ఎఫ్ 2 సినిమా తర్వాత ఈ సినిమాని భారీ అంచనాల నడుమ విడుదల చేస్తున్నాడు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: