
అసలు విషయంలోకి వెళ్తే.. యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ గురించి థమన్ మాట్లాడుతూ.. హుక్ స్టెప్స్ ఉండే పాటలు జనాల్లోకి బాగా ఈజీగా వెళ్తుందని చెప్పుకొచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమాలో అలాంటివేవీ కనిపించలేదని , అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాలో హుక్ స్టెప్స్ ఉండడం వల్లే ఆ సినిమాలోని పాటలు హైలెట్ అయ్యాయి. కానీ గేమ్ ఛేంజర్ సినిమాలో పాటలు బాగున్న అలా వైకుంఠపురం సినిమాకి వచ్చిన వ్యూస్ రాలేదని తెలియజేశారు. ఈ విషయంపై అటు అల్లు అర్జున్ తో ,రామ్ చరణ్ ని కంపేర్ చేస్తూ మాట్లాడడంతో రామ్ చరణ్ అభిమానులు థమన్ పై కోపంగా ఉన్నారు.
ఇప్పుడు తాజాగా ఓజి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ విషయం పైన క్లారిటీ ఇచ్చేశారు..తన బాధ రామ్ చరణ్ లాంటి ఒక మంచి డాన్సర్ పూర్తి స్థాయిలో ఉపయోగించు కోలేకపోయారని అందుకే ఆ సినిమా కిక్ ఇవ్వలేకపోయిందంటూ తెలియజేశారు. తన కంప్లైంట్ మొత్తం కూడా కొరియోగ్రాఫర్ల మీదే కానీ ,రామ్ చరణ్ మీద కాదు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.. అంతేకాకుండా మేము మేము బాగానే ఉంటాము కానీ ఎవరో ఏదో రాసిన వాటిని అపార్థం చేసుకొని మరి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారంటూ తెలియజేశారు థమన్. ప్రస్తుతం తమన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.