త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ‘అ’ సెంటిమెంట్ ఎక్కువ ఈ సెంటిమెంట్ తోనే చాల సినిమాలకు ‘అ’ అక్షరంతో ఉండే టైటిల్ ను ఫిక్స్ చేసి హిట్స్ కొట్టిన సందర్భాలు చాల ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఈ సెంటిమెంట్ కొన్ని సినిమాలకు వర్కౌట్ కాలేదు. ఉదాహరణ ‘అజ్ఞాతవాసి’ ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ తో తీస్తున్న సినిమాకు సంబంధించి ఈ సెంటిమెంట్ నుండి బయటకు వచ్చి డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.


మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈమూవీకి ‘గుంటూరు కారం’ అన్న టైటిల్ ఫిక్స్ చేసాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తిపోతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగను టార్గెట్ చేయబోతు విడుదల కాబోతున్న ఈ మూవీ టైటిల్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన మే 31న ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.


ఆమధ్య మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలచేసిన విషయం తెలిసిందే. మిర్చియార్డ్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ నడుచుకొని వస్తున్న మాస్ లుక్ ను చూసి అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు ఈ మూవీలో మహేష్ పాత్ర నెగిటివ్ టచ్ లో ఉంటుందని టాక్. ఇప్పటివరకు మహేష్ తన కెరియర్ లో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించక పోవడంతో ఈమూవీ అతడికి డిఫరెంట్ మూవీ అవుతుందని అంటున్నారు.


అయితే ఇప్పుడు ఈవిషయమే మహేష్ అభిమానులను కొంతవరకు కలవర పెడుతోంది. త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా తనదైన మార్క్ కామెడీతో సినిమాలు తీసే సమర్థత ఉంది కాని పూర్తి మాస్ సినిమాలను తీసి హిట్ కొట్టిన సందర్భాలు చాల తక్కువ అయితే ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ ను పూర్తి మాస్ అవతారంలో చూపెట్టడానికి కొత్త ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు సక్సస్ అవుతుంది అన్న భయాలు కూడ మహేష్ అభిమానులకు ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: