
ఆర్ఆర్ఆర్, దేవర ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపించారు. త్వర లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఎన్టీఆర్ 31లోనూ ఫుల్ రగెడ్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ క్యూట్ లుక్ లో దర్శనమిచ్చారు. తాజా ఫొటోషూట్ లో ఆయన చాలా క్యూట్‌గా కనిపించారు. ఓ బ్రాండ్ ఎండోర్స్ మెంట్ కోసం ఈ విధంగా సాఫ్ట్ లుక్ లో కనిపించినట్లు సమాచారం.ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ ఫొటోలను గమనిస్తే ఎన్టీఆర్ తన చిరునవ్వు తోనే ఆడియెన్స్ ను బాగా మెస్మరైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్‌ను ఆకర్షించేలా తన లుక్‌ను మార్చుకున్నారటా... ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ స్టైలిష్ గా, మ్యాన్లీ గా కనిపించారు. ఇటీవల విడుదలైన దేవర లుక్ లో చాలా వయెలెంట్ గా కనిపించిన ఎన్టీఆర్ . ఈ ఫొటో ల్లో మాత్రం నాన్ వయెలెన్స్ లుక్ తో బాగా ఆకట్టుకుంటున్నారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర చిత్రం లో చేస్తున్నారటా.ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకం పై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారని నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా అయితే వ్యవహిరంచారు