మెగాస్టార్ చిరంజీవి ఆఖరుగా వాల్టేరు వీరయ్య అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ప్రకాష్ రాజ్ , బాబి సింహ విలన్ పాత్రలలో నటించారు. ఈ సినిమాలో రవితేజ కు భార్య పాత్రలో కేథరిన్ నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. 

మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఇలా వాల్టేర్ వీరయ్య మూవీ తో అదిరిపోయే రేంజ్ కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్ , సుశాంత్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. మహతీ స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క "యూఎస్ఏ" హక్కులను "ప్రత్యంగిరా సినిమాస్" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన "యుఎస్ఏ" లో ప్రీమియర్స్ వేయనున్నారు. అలాగే ఈ సినిమాను "యూఎస్ఏ" లో 600 ప్లస్ లొకేషన్ లలో విడుదల చేయనున్నట్లు కూడా ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ సినిమాను "యూఎస్ఏ" లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాల్టర్ వీరయ్య మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి "భోళా శంకర్" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: