ఆర్ఆర్ఆర్ సినిమాతో  ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్.. కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి గ్లోబల్ స్టార్ గా గొప్ప పేరు ను సంపాదించు కున్నాడు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సాలిడ్ లైనప్ అయితే సెట్ చేసుకుంటున్నాడు. ఈ లిస్టులో ముందుగా కొరటాల సినిమా వుంది... ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ''దేవర( Devara )'' సినిమా ను చేస్తున్నాడు.

సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళింది.అప్పుడే రెండు షెడ్యూల్స్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ తో టీమ్ చాలా బిజీగా ఉంది.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం... అందుకే ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ అయితే నెలకొంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 31వ సినిమాను కూడా ఎన్టీఆర్ ఎప్పుడో ప్రకటించాడు.

సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రకటించాడటా ఎన్టీఆర్.ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్  అయితే వచ్చింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో భారీ యాక్షన్ డ్రామాగా అయితే ప్లాన్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా నుండి తాజాగా హీరోయిన్ గురించి మరోసారి నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంతకు ముందు దీపికా పదుకొనే పేరు వినిపించగా.. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా  హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.. ఈ బ్యూటీ గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకుని హాలీవుడ్ లో కూడా అలరిస్తుంది.. అందుకే ఈమెను ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తే బాగుంటుంది అని అనుకున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: