నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితం అంటే సుందరానికి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీ గా నిలిచిన ఈ సినిమా ఆ తర్వాత బుల్లి తెరపై ప్రసారం అయింది. కాకపోతే ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించడంలో కూడా తీవ్రంగా విఫలం అయింది.

సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు కేవలం 1.88 "టి ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే తెచ్చుకుంది. తెలుగు సినిమా అయి ఉండి ... అందులో యవరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఇంత తక్కువ "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంటుంది అని ఎవరు ఊహించి ఉండరు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ "టి ఆర్ పి" రేటింగ్ ను మరో మూవీ బీట్ చేసింది. ఆ సినిమా ఏదో తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రితం అడవి శేషు హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మేజర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , మలయాళ భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా బుల్లి తెరపై ప్రసారం అయింది. మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు "అంటే సుందరానికి" మూవీ కంటే కూడా తక్కువ "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది. మేజర్ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు కేవలం 1.87 "టి ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: