ప్రముఖ టాలీవుడ్ నటి ప్రగతి వయస్సు పెరుగుతున్నా వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి, తాను అనుభవించిన కష్టాల గురించి ఒక ఇంటర్వ్యూ లో ప్రగతి చెప్పు కొచ్చారు.మోడలింగ్ చెయ్యాలనేది పాయింట్ కాదని ఊరికే తింటున్నావ్ అనేలా చేసే కామెంట్లు నాకు నచ్చేవి కావని ఆమె వెల్లడించారు. తాను పిజ్జా హట్ లో పని చేశానని ఆమె పేర్కొన్నారు.

టెలీకాం బూత్ లో, ఎస్టీడీ బూత్ లో కూడా తాను పని చేశానని ప్రగతి తెలిపారు. కార్టూన్ డబ్బింగ్ కోసం నేను పని చేశానని ఆమె అన్నారు. ఒక యాడ్ కోసం నన్ను అడగ గా అలా మోడలింగ్ లోకి వచ్చానని ప్రగతి తెలిపారు. నన్ను ఒకరు స్పూర్తి గా తీసుకున్నారంటే ఆరోజు నేను ఎన్నో దాటానని ఆమె కామెంట్లు చేశారు. నేను అందగత్తెను కాదని ఆ సమయం లో లడ్డూలా ఉండే దానినని ప్రగతి వెల్లడించారు.

ప్రతి వృత్తి కి అర్హత ఉంటుందని దానికి ప్రిపేర్డ్ గా ఉండాలని ఆమె పేర్కొన్నారు. హీరోయిన్ గా వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేదని ప్రగతి చెప్పు కొచ్చారు. నాకు హీరోయిన్ గా పెద్దగా ఆసక్తి లేదని ఆమె అన్నారు. హీరో కమ్ నిర్మాతతో ఏర్పడిన వివాదం వల్ల సినిమాలే చేయకూడదని అనుకున్నానని ప్రగతి వెల్లడించడం గమనార్హం. అప్పట్లో అలా చేసుకున్నానని ఆమె తెలిపారు.

నేను ఎవరినీ బ్లేమ్ చేయనని ప్రగతి పేర్కొన్నారు. ఒకరిని నమ్మి మోసపోయారంటే మోసం చేసే వాళ్ల కంటే మోసపోయిన వాళ్లదే తప్పు అని ప్రగతి పేర్కొన్నారు. ఇంకోసారి అదే తప్పును రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుందని ప్రగతి అన్నారు. ప్రగతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రగతి కెరీర్ పరంగా మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: