‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రీచిన్న జీయర్ స్వామి ముఖ్య అతిధిగా వచ్చి ఆ మూవీ యూనిట్ సభ్యులకు ఆశీర్వాదం ఇచ్చారు. ఈనాటితరానికి మన పురాణాలు సంస్కృతి తెలియచెప్పే గొప్ప చిత్రంగా ‘ఆదిపురుష్’ ఉంటుందని ఆయన తన ఉపన్యాసంలో ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సంఘటన జరిగి కొన్ని రోజులు కూడ కాకుండానే అత్యంత పవిత్రమైన తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దర్శకుడు ఓం రౌత్ బహిరంగంగా ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి.సినిమా ఇండస్ట్రీలో సెలెబ్రెటీలు ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు కౌగలించుకోవడం ముద్దులు పెట్టుకోవడం సర్వసాధారణం. అయితే ఆ కల్చర్ ను ఓం రౌత్ తిరుపతి కొండ పై రిపీట్ చేయడం చాలామందికి ఆగ్రహాన్ని కలిగించింది. నిన్న ఉదయం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఓం రౌత్ కృతి సనన్ లు కలిసి వచ్చారు. శ్రీవారి దర్శనం అయినతరువాత తన ఫ్లైట్ కు సమయం అవ్వడంతో తాను వెళ్ళిపోతున్నాను అని చెప్పిన కృతి సనన్ వైపు ఓం రౌత్ అభిమానంగా చూస్తూ ఆమెను కౌగిలించుకోవడమే కాకుండా ముద్దు పెట్టుకున్న సంఘటన జరిగింది.కృతి సనన్ ను చూడటానికి వచ్చిన కొండమీద ఉన్న భక్తులు ఇలా అనుకోకుండా ఓం రౌత్ కృతి సనన్ పై వ్యక్తపరిచిన అభిమానానికి సంబంధించిన సంఘటన ఫోటోలను తమ సెల్ కెమెరాలతో తీసి చాలామంది సోషల్ మీడియాలో తమ ఎకౌంట్స్ లో పోష్ట్ చేసారు. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.‘ఆదిపురుష్’ మూవీలో పవిత్రమైన సీత పాత్రలో నటించిన కృతి సనన్ పట్ల ఓం రౌత్ ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ‘ఆదిపురుష్’ సినిమా ద్వారా ఈతరానికి ఓం రౌత్ ఇవ్వాలి అనుకున్న సందేశం ఇదేనా అంటూ విమర్శలు కూడ చేస్తున్నారు. ఏది ఏమైనా ‘ఆదిపురుష్’ మూవీకి ఈ నెగిటివ్ పబ్లిసిటీ కూడ బాగా కలిసివచ్చేలా అనిపిస్తోంది..
మరింత సమాచారం తెలుసుకోండి: