ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఈ నెల 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ తగరపడంతో తాజాగా ఈ మూవీ బృందం తిరుపతి లో భారీ ఎత్తున ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ  మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసిన ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి రెండు ట్రైలర్ లను కూడా విడుదల చేసింది. ఈ రెండు ట్రైలర్ లకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ నుండి ఫైనల్ ట్రైలర్ పేరుతో ఒక వీడియోను కూడా ఈ మూవీ బృందం విడుదల చేయగా దానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ 2 గంటల 59 నిమిషాల భారీ నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: