
ఇప్పటికే ట్రైలర్ పాటలను బట్టి చూస్తే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్, కృతి సనన్ పాత్రలలో జీవించారని చెప్పవచ్చు. భారతీయ పురాణాలలోని చాలా ముఖ్యమైన అంశం గురించి యువతరాలకు తెలియజేయడానికి ఇది ఒక అందమైన మార్గమని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో అద్భుతమైన దృశ్యాలను కూడా చిత్రీకరించారని తెలుపుతున్నారు.. భారతీయ వారసత్వ ముఖ్యాంశం ప్రేమ విధేయత మరియు భక్తి యొక్క మూలాలను ఈ చిత్రంలో చాలా హైలెట్గా చేసి ఒక గొప్ప అందించారు.
ఈ సినిమా అధికారికంగా ప్రతి భారతీయుడికి చెందినదిగా ధ్రువీకరించబడింది.. వాస్తవానికి రఘురామ్ దైవత్వానికి సంబంధించిన ఈ సినిమా వేడుకవుతుందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు.ఎస్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.. దాదాపుగా ఈ సినిమా రన్ టైం 3 గంటల పాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ , ప్రసాద్ సుతార్ యువి క్రియేషన్కు చెందిన ప్రమోద్ వంశీయులు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. పీపుల్ మీడియా సంస్థ ఆది పురుష్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతోంది.