పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీద పెట్టి వరుస సినిమాలను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు.. ఇప్పటి వరకు రాజకీయాలకు స్వల్పంగా బ్రేక్ ఇచ్చి సినిమాలు చేస్తూ ఉన్న పవన్ మరికొద్ది రోజుల్లో మళ్ళీ రాజకీయాల్లో బిజీగా మారబోతున్నాడని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమా లలో ''ఓజి' ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగి పోయాయి.. వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత హోప్స్ పెంచుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ కూడా బయటకు వచ్చింది.. రీసెంట్ గానే మూడవ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో ఒక యంగ్ అండ్ ఫేమస్ నటుడు ఉన్నట్టు అయితే సమాచారం.

తమిళ్ మరియు తెలుగు ఆడియెన్స్ లో మంచి బేస్ వాయిస్ తో పాటు ఫేమ్ కూడా ఉన్న నటుడు అర్జున్ దాస్ ఈ సినిమా సెట్ లో అడుగు పెట్టినట్టు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.. ఇదే విషయాన్నీ నిజం చేస్తూ మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఇతడు ఓజి సినిమాలో భాగం అయినట్టు కన్ఫర్మ్ కూడా చేసారు. ఒక పోస్టర్ రిలీజ్ చేసి వెల్కమ్ చెబుతూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా సాలిడ్ అనౌన్స్ మెంట్ చేసారు. ఇతడి వాయిస్ లో పవన్ పై మంచి ఎలివేషన్ పడితే కనుక ఈ సినిమా వేరే లెవల్లో అయితే ఉంటుంది అని పవన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. చూడాలి ఈ కాంబోలో సన్నివేశాలు ఎంత హైప్ ను పెంచుతాయో మరీ. మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని తెలుస్తుంది... వేగంగా పూర్తి అవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు కూడా వున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: