
మొన్నటి వరకు రూ.15 లక్షల వరకు మాత్రమే డబ్బు దాచుకునే వెసలుబాటు ఉండేది. కానీ ఇప్పుడు రూ. 30 లక్షలకు చేరుకుంది. సీనియర్ సిటిజన్స్ ఈ పథకంలో రూ.30 లక్షల వరకు డబ్బు పొదుపు చేసుకోవచ్చు. కాబట్టి ఇలా డబ్బు పొదుపు చేయడం వల్ల మీకు వడ్డీ కూడా ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం పై వడ్డీ రేటు 8% గా ఉండగా ఇది ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పథకంలోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది కాబట్టి నిజంగా ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి రాబడి పొందవచ్చు.
ఇకపోతే ఈ పథకం యొక్క మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు కాబట్టి మెచ్యూరిటీ కాలం దాటిన తర్వాత మీరు మరో మూడు సంవత్సరాలు పథకాన్ని పొడిగించుకోవచ్చు 8% వడ్డీ లభిస్తున్న నేపథ్యంలో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలవారి వడ్డీ ఎంత వస్తుంది . అనేది ఇప్పుడు చూద్దాం. ఈ పథకం మీరు రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.20,000 ప్రతినెల వడ్డీ రూపంలో పొందవచ్చు. 3 నెలలకు రూ.60,000 అదే ఏడాదికి రెండు లక్షల 40 వేల రూపాయలు పొందుతారు అంటే సుమారుగా రూ. 12 లక్షలకు పైగా ఆదాయం పథకం ముగిసేలోపు పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసి అధిక లాభాన్ని పొందండి.