మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలలో తన గ్లామర్ ఎక్స్ పోజ్ చేస్తూ టాప్ హీరోయిన్ గా ఆమె హవాని కొనసాగిస్తూనే ఉంది. ఈమధ్యనే విడుదలైన ‘బాహుబలి’ లో అవంతికలా కనిపించి అక్కడ కూడ తన గ్లామర్ ఎక్స్ పోజ్ చేసింది. ఆ ఎక్స్ పోజింగ్ పై జాతీయ స్థాయిలో విమర్శలు కూడ వచ్చాయి. 

అయితే భాగ్యనగరంలో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ(ఐఐఎఫ్ఏ) ఉత్సవ్-2015 కర్టెన్‌రైజర్ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన తమన్నా స్టన్నింగ్ లుక్ లో దర్శనవ్వడమే కాకుండా ఆమె వేసుకున్న ట్రాన్స్ పరెంట్ డ్రెస్ చూసి ఆ కార్యక్రమానికి వచ్చిన సినిమా సెలెబ్రెటీలతో పాటుగా రాజకీయనాయకుల మైండ్ కూడ బ్లాంక్ అయిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో తమన్నా సూపర్ హాట్ లుక్‌ లో చాల సెక్సీగా కనిపించింది. 

దక్షిణాది సినిమా రంగ టాప్ స్టార్స్ కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున, నమ్రత శిరోద్కర్, అల్లు అరవింద్, దేవిశ్రీ ప్రసాద్ లతో పాటు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యాక్రమంలో  పాల్గొన్నారు. వీరితో పాటులు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులు, ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు . అయితే ఎందరు ప్రముఖులు వచ్చినా అందరి దృష్టి  తమన్నా వేసుకున్న ట్రాన్స్ పరెంట్ డ్రెస్ పైనే నిలిచింది. సినిమా తారలు ఇలాంటి డ్రెస్సులు  వేసుకుని ఫంక్షన్లకు రావడం సర్వసాధరణ విషయమే అయినా  ఎక్కడ పాటించాల్సిన పద్దతులు అక్కడ పాటించకుండా  తమన్నా ఇలాంటి డ్రెస్ ఎంచుకోవడం చూసి అందరూ షాక్ అవ్వడమే కాకుండా ఆమె రాంగ్ సెలక్షన్ డ్రెస్ లో ఈ కార్యక్రమానికి  వచ్చింది అని కామెంట్ చేసుకున్నారు అని తెలుస్తోంది. 

అదీ కాకుండా మంత్రులు పాల్గొన్నా ఒక ప్రముఖ సమావేశానికి  తమన్నా ఇంత హాట్ గా రెడీ అయి రావడం ఏమిటి అని మీడియా ప్రతినిధులు కూడా కామెంట్ చేసుకున్నట్లు టాక్. కామెంట్స్ ఎలా వస్తున్నా మిల్కీ బ్యూటీ ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా ఈ సమావేశంలో హడావిడి చేయడం ఆ కార్యక్రమానికి హైలెట్ గా మారింది. అయితే పారితోషిక విషయాలకు తప్పిoచి మిగతా విషయాలు పట్టించుకొని మన హీరోయిన్స్ కు ఇవి స్వర్వ సాధారణ విషయాలే అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: