సినిమాల్లో ఎవరి టాలెంట్ ఏంటి అనేది ఎవరు ఊహించలేరు.. ఫ్లాప్ తీసిన దర్శకుల్లో టాలెంట్ ఉండదు అని చెప్పలేం.. హిట్ కొట్టిన దర్శకుడు ప్రతిభావంతుడు అని చెప్పలేం. అదంతా లక్ మీద ఆధారపడి ఉంటుంది అంతే.. ప్రస్తుతం ఓ చిన్న సినిమా దర్శకుడు స్టార్ హీరో సినిమా చేస్తానంటూ షాక్ ఇవ్వడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య సినిమాలతో దర్శకుడిగా మారిన అని కన్నెగంటి రెండు సినిమాలతో ఏమాత్రం పేరుని సంపాధిచలేకపోయాడు. అసాధ్యుడు పర్వాలేదనిపించుకున్నా మిస్టర్ నూకయ్య మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అయితే తమిళ నేరం సినిమాను తెలుగులో రీమేక్ చేసి హిట్ కొడదాం అనుకున్న దర్శకుడు అనికి ఆశించిన ఫలితం అందలేదు.
అయితే రన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అని నాలుగేళ్ల క్రితం నుండి రాం చరణ్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పి షాక్ ఇచ్చాడు. రాం చరణ్ కోసం రాజకీయ నాయకుడి సబ్జెక్ట్ తో ఓ కథ సిద్ధం చేసుకున్నాడట అని కన్నెగంటి. అయితే చెర్రి మాత్రం అనికి అవకాశం ఇవ్వలేదట. అయితే రన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అని ఈ విషయాన్ని వెళ్లడిస్తూ ఎప్పటికైనా చెర్రితో ఆ సినిమా తీస్తానని అన్నాడు.
సో మరి అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు అంటే కథలో ఏదో దమ్ము ఉండే ఉంటుంది. మరి రాం చరణ్ ఈ విషయంలో చొరవ తీసుకుని ఆ సోషియో ఫ్యాటసీ సినిమా ఏదో వింటే పోతుంది. ప్రస్తుతం చరణ్ తని ఒరువన్ తెలుగు రీమేక్ ధృవ సినిమా షూట్లో ఉన్నాడు. మెగాస్టార్ ఇంట పెళ్లి సందడి కారణంగా సినిమా షూట్ ని వాయిదా వేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి