పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకు అంత క్రేజ్. ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరి హీరోలకంటే ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఎందుకు? ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కంటే బాగా నటించే హీరోలు ఉన్నప్పటికీ… పవన్ కళ్యాణ్ వెంటే అభిమానులు ఎందుకు ఉంటారు? అయితే ఈ ప్రశ్నలకి జవాబు పవన్ కళ్యాణ్ తన సినిమాల ద్వారా, వ్యక్తిత్వం ద్వారా జవాబుని ఎప్పుడో ఇచ్చారు.

అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఫ్యాన్స్ కి ఎంతో ఇష్టం. తను నడిచే నడక, చేసే పని అంటే ఫ్యాన్స్ కి మరింత ఇష్టం. పవన్ కళ్యాణ్ ఏది చేసినా సమాజాన్ని,దేశాన్ని, ఇతరులకి మంచి జరగాలనే ఆలోచనతో చేస్తారు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ తో పాటు అందరికీ ప్రత్యేకం. పవన్ కళ్యాణ్ భావాలని పంచుకోవాలని చాలా మంది రెడీగా ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా తన ధోరణి ఇతరుల మంచి గురించే ఉంటుంది.

ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు వారిని సంస్కరించే గుణం పవన్ కళ్యాణ్ కి ముందుగా ఉంటుంది. అయితే తాజాగా ప్రత్యేక హోదా  పై జరిగిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్,టాప్ డైరెక్టర్ వర్మ ఫ్యామిలీపై నోరు జారాడనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. పవన్ కళ్యాణ్ ప్రత్యేకహోదా పై యువత జరిపిన నిరసన సభలో ఎందుకు పాల్గోనలేదు అనేది వర్మ డైరెక్ట్ క్వశ్ఛన్.

దీనికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం..వర్మ ఫ్యామిలీని ఉదాహరణగా చూపిస్తూ చెప్పటం వర్మకి బాధకలిగించే విధంగా ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. వర్మ తన కూతురితో ఉండే ప్రవర్తన సరిగా లేదని చెప్పటంతో వర్మకి బాధ కలిగించింది. ఇందుకు వర్మ...మెగాఫ్యామిలీ లోపలి విషయాలను ఎప్పుడూ కామెంట్ చేయలేదు. కానీ మీరు మాత్రం చేయవచ్చా? అంటూ తనదైన శైలిలో వర్మ జవాబివ్వటం ఇక్కడ విశేషంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: