తెలుగు ఇండస్ట్రీలో కొంత కాలంగా గ్లామర్ ప్రాధాన్య తగ్గించి..కేవలం నటనకే ప్రాధాన్య ఇస్తుంది అనుష్క.  ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రం తరువాత ‘సైజ్ జీరో’ చిత్రం కోసం భారీగా బరువు పెరిగిన స్వీటీ ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ కోసం చాల కష్టపడి బరువు తగ్గింది.ఇక బాహుబలి 2 తరువాత అనుష్క లీడ్‌ రోల్‌లో నటించిన ‘భాగమతి’ ఇటీవల విడుదలై విజయాన్ని అందుకుంది. అనుష్క తాజాచిత్రం 'భాగమతి' భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు మంచి ఓపెనింగ్స్‌ రాబట్టింది.   
Image result for భాగమతి
అమెరికాలో 1,56, 538 డాలర్లు వసూలు చేసింది. దక్షిణాదిలో మహిళ ప్రాధాన్యమున్న చిత్రాల్లో అత్యధిక ఆరంభ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.  దేశ వ్యాప్తంగా మొత్తం 1200 థియేటర్లలో ‘భాగమతి’ విడుదలైంది. దక్షిణాదిలో ఓ నటీమణి ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఈ స్థాయిలో విడుదలవడం ఇదే తొలిసారి.
Image result for భాగమతి కలెక్షన్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే జనవరి 26వ తేదీ ఉదయం ఆట నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. కేవలం తొలి వీకెండ్ లోనే ఈ సినిమా 12.14 కోట్ల రూపాయలను.. షేర్ రూపంలో తెలుగు రాష్ట్రాల నుంచే సాధించింది. ఫిమేల్ లీడ్ మూవీస్ లో ఇదే ఇప్పటివరకూ అతి పెద్ద టాలీవుడ్ రికార్డ్ గా చెప్పవచ్చు.
Image result for భాగమతి
దీపిక పద్మావత్ నుంచి పోటీ ఉంటుందని ఆశించినా.. అంతగా ప్రభావం చూపలేకపోయింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లోను .. ఓవర్సీస్ లోను కలుపుకుని, తొలివారంతంలో ఈ సినిమా 36 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిందని చెబుతున్నారు.
Image result for భాగమతి కలెక్షన్స్
వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కంటిన్యూ చేస్తుండటం విశేషం. తెలుగు .. తమిళ.. మలయాళ .. ఓవర్సీస్ వసూళ్లను కలుపుకుంటే, తొలివారం ముగిసేనాటికీ ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: