నిన్న రిలీజ్ అయిన మహానటి సినిమాపై అంతటా మంచి టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు బరువెక్కిన హృదయాలతో ఇంటికి వెళ్తున్నారని పబ్లిక్ టాక్ చూస్తే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అప్పటి దర్శక నిర్మాతల పాత్రలని పోశించిన వారు కూడా చాలా చక్కగా చేశారు. ముఖ్యంగా ఎస్వియార్ గా కలక్షన్ కింగ్ మోహన్ బాబు ఆకట్టుకోగా.. అక్కినేని నాగేశ్వర రావుగా నాగచైతన్య ఇంప్రెస్ చేశాడు.


సినిమా మొత్తం మీద ఏయన్నార్ గా నాగ చైతన్యకు ఐదారు సీన్స్ పడ్డాయి. ఇక ఎన్.టి.ఆర్ కు మాత్రం ఆ ఛాన్స్ లేకుండా చేశారు. ఎన్.టి.ఆర్ గా జూనియర్ ని అడిగినా ఆయన చేయనని చెప్పారు. అయితే సినిమాలో ఓ చోట కర్రసాము ఆడుతుంటే పాము వస్తుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఎవరయ్యా అతను అంటే రామారావు అంటాడు పక్కన అతను.. పూర్తి పేరు నందమూరి తారక రామారావు అంటారు. ఇది గుర్తుంచుకోవాల్సిన పేరు అంటారు కె.వి చౌదరి.


సో అలా ఎన్.టి.ఆర్ ను అలా రెండు సెకన్ల డిజిటల్ రూపంలో చూపించారు. అంతే ఒకవేళ అదే సీన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కనిపించి ఉంటే ఎలా ఉండేది. అంతేకాదు తారక్ ఒప్పుకుంటే సినిమాలో మరో నాలుగైదు సీన్స్ ఎన్.టి.ఆర్ వి పడేవి. నందమూరి ఫ్యాన్స్ కు ఈ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నా ఎన్.టి.ఆర్ గుర్తుంచుకోవాల్సిన పేరు అని రాజేంద్ర ప్రసాద్ చెప్పడం అందరిని ఆలరిస్తుంది. 


ఒకవేళ జూనియర్ కనుక మహానటిలో నటిస్తే తప్పకుండా సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేది. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు కీర్తి సురేష్ అభినయానికి ఫిదా అయ్యారు. మహానటి సినిమా చేసేందుకే ఆమె తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిందని ప్రస్థావించడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: