ఎటువంటి మార్పులు లేకుండా ‘అరవింద సమేత’ అక్టోబర్ 11న విడుదల అవుతున్నట్లు ప్రకటిస్తూ నేడు అధికారికంగా రిలీజ్ డేట్ పోస్టర్ ను  విడుదల చేయడంతో ఈమూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది.   ఇప్పటికే ఈసినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  
Jr NTR
థమన్ ఆడియో పూర్తిగా చార్ట్ బస్టర్ కానప్పటికీ సినిమా హై ఎమోషన్లో సాగుతుందనే లీకులు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు రెండు సెంటిమెంట్స్ వెంటాడు తున్నాయి. సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ మంగళవారం పెట్టరు. దీనికికారణం ఇండస్ట్రీ సెంటిమెంట్ ప్రకారం మంగళ వారం కలిసిరాదు అనే ప్రచారం ఉంది. 
A still from the teaser
దీనితో 90 శాతం మంది టాలీవుడ్ జనాలు మంగళవారాన్ని అశుభంగా భావిస్తారు. కానీ ‘అరవింద సమేత’ యూనిట్ మాత్రం మంగళవారాన్ని తన మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముహూర్తంగా ఎంచుకోవడం వెనుక ఒక బలమైన సెంటిమెంట్ ఉంది అని వార్తలు వస్తున్నాయి. నిర్మాత రాధాకృష్ణ దర్శకుడు త్రివిక్రమ్ హీరోఎన్టీఆర్ ఇలా ఈముగ్గురు జాతకాలకు అనువైన తేదీగా అక్టోబర్ 2ను త్రివిక్రమ్ కు సన్నిహితుడైన ఒక జ్యోతిష్య పండితుడు నిర్ణయించినట్లు టాక్. దీనితో ఫిలిం ఇండస్ట్రీ మంగళవారం సెంటిమెంట్ ను పక్కకు పెట్టారని తెలుస్తోంది.
  .Jr NTR in Aravinda Sametha
మరోవైపు ఈమూవీ విడుదల తేదీని కూడా ఇదే ప్రాతిపదికన నిర్ణయించినట్టు తెలుస్తోంది.  వాస్తవానికి ఆరోజు గురువారం అయినప్పటికీ జూనియర్ త్రివిక్రమ్ ల జాతకరీత్యా ఆరోజు అమోఘంగా కలిసి వస్తుందని జ్యోతిష్యుడు చెప్పడంతో ఈ రెండు సెంటిమెంట్స్ ను ఆధారంగా చేసుకుని రికార్డులు బ్రేక్ చేయడానికి ‘అరవింద సమేత’ తన వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ జ్యోతిష్య అంచనాలు ఎంతవరకు ‘అరవింద సమేత’ ను రక్షిస్తాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: