పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఒక హీరో ఇలా వరుస విజయాలు అందుకుంటుంటే..అటోమెటిక్ గా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది మూవీల్లో నటించిన ఫలక్నుమా దాస్ మూవీ మొన్న శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం బాగోపోవటంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ సంగతి తెలిసిందే. అయితే వీటిని దర్శకుడు, నటుడు అయిన విశ్వక్ సేన్ తట్టుకోలేకపోతున్నారు. అంతే కాదు సినిమాలో విశ్వక్ కొన్ని సీన్లలో విజయ్ ని అనుకరించినట్టు ఉండటమే వారి ఆగ్రహానికి కారణమైంది.
ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ స్పందించారు.. ఇక తన సినిమాకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే, చూస్తూ ఊరుకునేది లేదని, తన అభిమానుల కామెంట్ల వెనుక విజయ్ దేవరకొండ ఉన్నాడని విశ్వక్ ఆరోపిస్తున్నారు. ను హైదరాబాద్ కు రానున్నానని, వచ్చిన వెంటనే మీడియా సమావేశం పెట్టి, అందరికీ సమాధానం ఇస్తానని చెబుతూ విశ్వక్, ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. తాను హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించి, సక్సెస్ మీట్ ను పెట్టనున్నానని స్పష్టం చేశాడు.