ఒకప్పుడు కోలీవుడ్ హీరో సూర్య సినిమా విడుదల అవుతూ ఉంటే టాలీవుడ్ టాప్ హీరోలు తమ సినిమాల డేట్స్ ను మార్చుకునే వారు. గజినీ మూవీ తరువాత సూర్య దక్షిణాది సూపర్ స్టార్ అవుతాడు అని అంతా భావించారు. అయితే ఇప్పడు సీన్ రివర్స్ కావడంతో సూర్య సినిమాలకు తెలుగులో కనీసపు కలక్షన్స్ కూడ రావడం లేదు.
లేటెస్ట్ గా అతడు నటించిన ‘బందోబస్త్’ మూవీ కూడ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇలాంటి పరిస్థితులలో సూర్య ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి మోహన్ బాబు ఇంటికి వెళ్లి ఆయనతో రహస్య చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సూర్య మోహన్ బాబుతో కలిసి తెలుగు తమిళ భాషలలో నిర్మించబోతున్న ఒక మూవీలో నటిస్తున్నాడు.
ఈ మూవీకి ‘గురు’ ఫేం సుధ కొంగర దర్శకత్వం వహిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో చాల వేగంగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో సూర్య మోహన్ బాబు ఇంటికి వెళ్ళి ఈ సినిమా గురించి మాట్లాడాడా లేకుంటే మరో కొత్త ప్రాజెక్ట్ గురించి అతడు మోహన్ బాబుతో చర్చించాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మోహన్ బాబు ఇంటి వద్ద సూర్యను మంచు విష్ణు స్వయంగా రిసీవ్ చేసుకుని అతిధి మర్యాదలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీనితో ఈ ద్విభాషా చిత్రం కమ్ మల్టీస్టారర్ తో సూర్యకు విజయం దక్కుతుందా అన్న ఆశలు సూర్య అభిమానులలో ఏర్పడుతున్నాయి. ఈ మూవీకి ఒక పవర్ ఫుల్ టైటిల్ ను తెలుగులో పెట్టడానికి సూర్య మోహన్ బాబుల మధ్య ప్రాధమిక చర్చలు జరిగినట్లు సమాచారం. తెలుగులో క్రేజ్ కోల్పోయిన మోహన్ బాబు తమిళంలో సక్సస్ లు లేని సూర్య కలిసి చేయబోతున్న ఈప్రయోగం విజయవంతం అవుతుందని ఆశిద్దాం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి