‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మహేష్ తో నటిస్తున్న విజయశాంతి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసింది. బాలనటుడుగా తనతో మహేష్ నటించిన అలనాటి రోజులను గుర్తుకు చేసుకుంటూ అప్పట్లో ముద్దుగా బొద్దుగా కనిపించే మహేష్ ను తాను చూసినప్పుడు అతడు ఈ స్థాయిలో సూపర్ స్టార్ అవుతాడని  తాను ఊహించలేదు అంటూ కామెంట్స్ చేసింది. 

అంతేకాదు మహేష్ మొట్టమొదటి సినిమా ‘రాజకుమారుడు’ విడుదల అయిన తరువాత మహేష్ పై తన అభిప్రాయాలు పూర్తిగా మారిపోయిన విషయాలను వివరించింది. ఆ మూవీ తాను చూసిన తరువాత క్రికెట్ రంగంలో సచిన్ సంచలనాలు సృష్టించినట్లుగా మహేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తాడని తాను ఆనాడే సూపర్ కృష్ణకు జోశ్యం చెప్పిన విషయాలను వివరించింది. 

ఆ తరువాత తాను సినిమాల నుండి దూరం అయిన తరువాత తాను మళ్ళీ మహేష్ తోనే కలిసి నటిస్తానని అనుకోలేదు అంటూ సెట్లో తమ ఇద్దరి సాన్నిహిత్యం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ స్పాట్ లో మహేష్ తనను అభిమానంగా అమ్మా అని పిలిస్తే తాను బాబు అంటూ పిలుస్తూ షూటింగ్ సమయంలో అభిమానంగా కలిసి నటిస్తున్న విషయాలను వివరించింది. 

సాధారణంగా టాప్ హీరోలు అందర్నీ ఆ మూవీ యూనిట్ సభ్యులు ‘బాబు’ అంటూ సంభోదించడం పరిపాటి. ఇప్పుడు అదే పద్ధతిని విజయశాంతి కూడ అనుసరిస్తూ మహేష్ అభిమానులకు జోష్ ను ఇచ్చే విధంగా మరొక ట్విస్ట్ ఇచ్చింది. సూపర్ స్టార్ కృష్ణకు మహేష్ కు ఉన్న తేడాను వివరిస్తూ కృష్ణ చాల సాఫ్ట్ గా కనిపిస్తే మహేష్ సాఫ్ట్ గా కనిపిస్తూనే ఎదుటి మనిషికి చెక్ పెట్టగల సమర్ధత అతడి నవ్వులో కనిపిస్తుంది అంటూ విజయశాంతి మహేష్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు మహేష్ అభిమానుల మధ్య వైరల్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: