రకుల్ సీక్రెట్ గా టాలీవుడ్ స్టార్ హీరోతో లవ్ ఎఫైర్ సాగిస్తోందా..! ఈ హీరో కోసమే ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఓ ఫ్లాప్ కూడా తీసుకుందట. అంతేకాదు సదరు హీరో పక్క ఫ్లాట్ లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. పైగా ఫ్రెండ్ షిప్ అంటున్న ఈ బ్యూటీ ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నట్టు టాక్. 


స్పైడర్, మన్మథుడు2 బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ తెలుగులో రకుల్ కి ఛాన్స్ లు తగ్గిపోయాయి. రెండేళ్లు టాలీవుడ్ ని ఊపేసిన ఈ బ్యూటీ ఇప్పుడు అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. అయితే చేతిలో తెలుగు సినిమాలు లేకపోయినా రకుల్ మాత్రం టాలీవుడ్ లో మకాం వేస్తోందట. ఇందులో ఓ యంగ్ హీరోనే కారణమని తెలుస్తోంది. సదరు హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్న రకుల్ టాలీవుడ్ ని విడిచి వెళ్లేందుకు అసలు ఇష్టపడటం లేదని సమాచారం. 


రకుల్ ప్రీత్ సింగ్, యంగ్ హీరో దగ్గుబాటి రానాతో లవ్ ఎఫైర్ సాగిస్తోందని టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట లవ్ టాపిక్ పై హాట్ హాట్ డిస్కషన్స్ సాగుతున్నాయి. అంతేకాదు ఈ బ్యూటీ రానా ఇంటిపక్కనే ఓ ఫ్లాట్ కూడా కొనేసిందట. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని వినిపిస్తోంది. కొంతకాలంగా ఇద్దరు సీక్రెట్ గా లవ్ ఎఫైర్ సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 


తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్, రానాతో లవ్ ఎఫైర్ పై తడబడటం కూడా ఆసక్తిగా మారింది. అయితే ఇంటి పక్కనే ఇల్లు ఉన్నంత మాత్రాన మా మధ్య లవ్ ఉన్నట్టా అంటూ అమ్మడు రివర్స్ క్వశ్చన్ వేస్తోంది. రానా క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే అంటోంది. రానాతో కలిసి నటించకపోయినా ఇద్దరి మధ్య థిక్ క్లోజ్ నెస్ ఉండటం గురించి ఆసక్తిగా మారింది. అదేంటో కానీ రానాపై నిత్యం ఏదోక హీరోయిన్ తో లింక్ పెడుతూ వార్తలు వస్తుంటాయి. గతంలో త్రిష, బిపాస బసు, శ్రియ లాంటి హీరోయిన్స్ రానాతో లవ్ ఎఫైర్ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: