ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ఎంతో మంది బుల్లితెర అభిమానులు ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్వించే జబర్దస్త్ షో వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయే వారు ఎంతోమంది. ఒక మామూలు కామెడీ షో గా ఈ టీవీలో ప్రసారమైన జబర్దస్త్ షో  ప్రస్తుతం తెలుగు బుల్లితెర లోనే టాప్ రేటింగ్ దూసుకుపోతున్నది  కామెడీ షో. జబర్దస్త్ షో తర్వాత ఎన్నో కామెడీ  షోలు వచ్చినప్పటికీ జబర్దస్తు నవ్వుల సునామీలో కొట్టుకుపోయాయి . అయితే జబర్దస్త్ షో కి ఎంత పాపులారిటీ ఉందో  జబర్దస్త్ షోలో జడ్జిగా చేసే నాగబాబు నవ్వులకు  కూడా అంతే పాపులారిటీ ఉంది. జబర్దస్త్ అంతగా హిట్ అవ్వడానికి నాగబాబు నవ్వులు  కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అయితే జబర్దస్త్ కామెడీయన్స్  కూడా ఎంతో పాపులారిటీ సంపాదించి సినిమాలు అవకాశాలు కూడా సంపాదిస్తున్నారు. అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా లక్షల్లో సంపాదిస్తూ హ్యాపీ లైఫ్ ని లీడ్  చేస్తున్నారు జబర్దస్త్ కమెడియన్స్. 

 

 

 

 ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా జబర్దస్త్ షో మీద కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో నుండి  అందరూ వేరే పోకి మారుతున్నారని   దీంతో జబర్దస్త్ షో  మూసి వేస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జబర్దస్త్ లో బాగా పాపులరైన చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ టీం లు జబర్దస్త్ ఉన్న నుండి  బయటకు వచ్చేస్తున్నారని...  అంతేకాకుండా మెగా బ్రదర్  నాగబాబు కూడా జబర్దస్త్ షోలో జడ్జ్ గా  తప్పుకుంటున్నారు  అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ వార్తలన్నీ నిజమేనా  నమ్మాలా వద్దా అనే కన్ఫ్యూషన్ లో ప్రజలు ఉండిపోయారు. అయితే ప్రస్తుతం ఈ వార్తలన్నిటికి  ఫుల్ క్లారిటీ వచ్చేసింది. 

 

 

 

 ఇంతకీ జబర్దస్త్ నుంచి వీళ్ళు అందరూ బయటకు వెళ్తున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఎవరో తెలుసా జబర్దస్త్ టీం లీడర్ చమ్మక్ చంద్ర. తానే స్వయంగా జబర్దస్త్ నుంచి బయటకు వచేస్తున్నవారి గురించి క్లారిటీ ఇచ్చాడు . అయితే ఈ మధ్య జబర్దస్త్ చమ్మక్ చంద్ర తెనాలి రామకృష్ణ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెనాలి రామకృష్ణ సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంగా... జబర్దస్త్ మూసి  వేస్తున్నారా... జబర్దస్త్ షో నుంచి టీం లీడర్లు అందరూ బయటకు వస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం అంటూ యాంకర్  ప్రశ్నించారు. అయితే జబర్దస్త్ నుంచి నాగబాబు గారు బయటకు వచ్చారని ఆయన తో పాటు తాము కూడా బయటకు వచ్చాము  అంటూ క్లారిటీ ఇచ్చారు చమ్మక్ చంద్ర . అయితే జబర్దస్త్ షో మాత్రం ముగిసిపోదని  జబర్దస్త్ మాకు లైఫ్ ఇచ్చిన షో  అంటూ చమ్మక్ చంద్ర తెలిపాడు. ఒక చమ్మక్ చంద్ర టీమే కాకుండా సుడిగాలి సుదీర్,  హైపర్ ఆది టీం కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: