ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే ఎప్పుడూ ఒకేలా ఉంటే కుదరదు. అవకాశాలు వచ్చినంతవరకు ఎలా ఉన్నా సరిపోతుంది కాని ఒక్కసారి అవి రాకపోతే మాత్రం కష్టపడాల్సి ఉంటుంది. ఎలాంటి భామ అయినా సరే ఫోటో షూట్స్ తో పిచ్చెక్కించడం కామనే. ఇప్పుడు అదే దారిలో తన పూర్తి మేకోవర్ లుక్ తో మతిపోగొడుతుంది హీరోయిన్ అవికా గోర్. తెలుగు వాళ్లకు చిన్నారి పెళ్లికూతురుగా పరిచయమైన ఈ అమ్మడు ఉయాల జంపాల సినిమాతో హీరోయిన్ గా నటించింది. 

 

ఆ సినిమా తర్వాత కూడా ఐదారు సినిమాలు చేసింది. బొద్దుగా ఉన్న తన రూపం అవకాశాలు రాకుండా చేస్తుందని భావించిన ఈ అమ్మడు. కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి తన లుక్ మార్చేసింది ఈ అమ్మడు. ఇదివరకు బొద్దుగా ముద్దుగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు సన్నగా మారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

 

సన్నగా మారడమే కాదు గ్లామర్ షో విషయంలో కూడా ఒక అడుగు ముందుకేసింది అవికా. లేటెస్ట్ గా అమ్మడి ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవికా ఇదివరకు ఫోటోలతో ప్రస్తుతం ఫోటో పోల్చుతూ వావ్ అవికా వాట్ ఏ లుక్ అనేస్తున్నారు. నిజంగా అవికా ఈ కొత్త లుక్ ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చేలా ఉంది. 

 

రీసెంట్ గా రాజు గారి గది 3 సినిమాలో నటించిన అవికా గోర్ ఆ సినిమాతో నటన పరంగా ఆమె అదరగొట్టింది. తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అవికా గోర్ ప్రస్తుతం హాట్ లుక్స్ తో కేక పుట్టిస్తుంది. తప్పకుండా అవికా తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకునేలా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం రెండు మూడు కథలు డిస్కషన్స్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఈ మేకోవర్ అవికాకు మంచి క్రేజ్ తెచ్చేలా ఉందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: