టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. తనకంటూ టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుని  తెలుగు ప్రేక్షకుల యంగ్ రెబల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. ఒక్క నటన విషయంలోనే కాదు దేహ దారుఢ్యం విషయంలో కూడా ప్రభాస్ కి ఎవరూ సాటి లేరు అనే చెప్పాలి. ఇక పవర్ఫుల్ హీరోయిజానికి ప్రభాస్ పెట్టింది పేరు. టాలీవుడ్ లో అతి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ప్రభాస్ సినిమా ఏదైనా విడుదల అవుతుంది అంటే దాని పైన ప్రేక్షకుల్లో ఒక రేంజ్ లో అంచనాలు పెరిగి పోతూ ఉంటాయి. పవర్ఫుల్ హీరోయిజంతోనే రెబల్ స్టార్ గా మారిన ప్రభాస్... తెలుగు ప్రేక్షకుల లవర్ బాయ్ కూడా.అందుకే ఎంతో టాలీవుడ్ ప్రేక్షకులకు  డార్లింగా  కూడా మారిపోయాడు ప్రభాస్. ఇక ప్రేక్షకులందరూ ప్రభాస్ ని డార్లింగ్ డార్లింగ్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ప్రభాస్ సినిమాలతోనే కాదు తను ఆటిట్యూడ్.. మనసుతో కూడా తెలుగు ప్రేక్షకులందరూ మనసులు గెలిచాడు ప్రభాస్. 

 

 

 

 

 ఇక సినిమాల విషయానికొస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ చేసిన చిత్రాలు ఎంతో  విభిన్నమైనవి. వాడు పోతే వీడు.. వీడు పోతే నేను నేను పోతే.. నా  అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగపడితే అంటూ... అభిమానుల్లో రక్తాన్ని మరిగించాలన్న.. వీలైతే ప్రేమిద్దాం డూడ్ మహా అయితే  తిరిగి ప్రేమిస్తారు.. అంటూ లవర్ బాయ్ గా మారాలన్న... జై మాహిష్మతి అంటూ రారాజుగా రాజసం చూపించాలన్న టాలీవుడ్ లో అది ఒక ప్రభాస్ కి సాధ్యమైందని చెప్పాలి. ఇక అప్పటివరకు ప్రభాస్ కి  ఒక రేంజ్ లో టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది... కానీ బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ క్రేజ్  ప్రపంచం నలుమూలలా వ్యాపించింది.  ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచంలోని ఎంతోమంది అభిమానులు ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. 

 

 

 

 వాడు పోతే వీడు వీడు పోతే మరొకడు కాదు టాలీవుడ్ కి ప్రభాస్ వచ్చాడు అంటున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ బరిలోకి దిగడం అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటున్నారు. అంతేకాదండోయ్ ప్రభాస్ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా ఉన్నాడు. దీంతో అమ్మాయిలు ప్రభాస్ మరింత క్రేజ్   పెరిగిపోయింది. అమ్మాయిలు అబ్బాయిలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రభాస్ కి అందరూ అభిమానులు అయిపోయారు. ఒక హీరోగానే కాదు ఒక మంచి మనిషిగా కూడా ప్రభాస్ కు అభిమానులు చాలా మంది. బాహుబలి తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: