నందమూరి తారక రామారావు ఈ పేరుకి ఒక చరిత్ర ఉంది. తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా పెద్దాయన పేరు ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంది. ఆయన వారసత్వంగా వచ్చిన జూనియర్ ఎన్.టి.ఆర్ కూడా తాతకు తగ్గ మనవడిగా సంచలనాలు సృష్టిస్తున్నాడు. 

 

నందమూరి సిని ప్రస్థానాన్ని పెద్దాయన తర్వాత బాలకృష్ణ కొనసాగించారు. అయితే ఆ తర్వాత ఆ బాధ్యత జూనియర్ మీద పడ్డది. నిన్ను చూడాలని సినిమా నుండి అరవింద సమేత వీర రాఘవ వరకు సినిమా సినిమాకు తన అభిమానులను.. సిని ప్రేక్షకులను అలరితూ వస్తున్నాడు తారక్. అంతేకాదు జీవితంలో తను ఎదుర్కున్న కష్టాల సారంతో పెరిగిన బాధ్యతని తన మాటల్లో చూపిస్తుంటాడు.

 

ఎంచుకున్న సినిమాలో పాత్ర ఏదైనా సరే ఘట్టమేదైనా సరే అదరగొట్టడమే తారక్ కు తెలిసిన పని. ఇప్పటితరం కథనాయకుల్లో పౌరాణికం చేయాలంటే అది తారక్ ఒక్కడి వల్లే అవుతుందని అందరికి తెలిసిన విషయమే. ఒక పౌరాణికమే కాదు.. అల్ట్రా మోడ్రెన్ గా కూడా అబ్బురపరుస్తాడు మన ఎన్.టీవోడు. 18 ఏళ్ల కెరియర్ 28 సినిమాల అనుభవం అన్ని తన సినిమా కోసం టికెట్టు తీసుకుని వచ్చిన ప్రేక్షకుడిన్ని మెప్పించడమే జూనియర్ ఎన్.టి.ఆర్ కు తెలిసిన పని.

 

ఎన్.టి.ఆర్ సహజ నటనకు తెలుగు పరిశ్రమ హీరోలే అభిమానులున్నారని తెలిసిందే. అంతేకాదు తారక్ అభినయం గురించి ఇతర భాషల హీరోలు కూడా మెచ్చుకుంటారు. నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని ప్రియులు కూడా తారక్ చేసే సినిమాల మీద ఆసక్తిగా ఉంటారు. అందుకే కొకా కోలా పెప్సీ తారక్ బాబు సెక్సీ అనాల్సిందే. తను చెసే సినిమాలతో సర్ ప్రైజ్ చేసే తారక్ ఇకమీదట కూడా ఇలాంటి సినిమాలే చేయాలనీ ఆశిస్తున్నారు ఫ్యాన్స్.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: