బాక్సర్ గా మైక్ టైసన్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయనవసరం  లేదు. అయితే అలాంటి మైక్ టైసన్ ఇప్పుడు విజయ్ దేవరకొండ మ్యానియాకు సహకరించబోతూ ఉండటం అందరికీ హాట్ న్యూస్ గా మారింది. పూరీ జగన్నాథ్ విజయ్ ల కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీని పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే ఈ మూవీ ప్రాజెక్ట్ కు కరణ్ జోహార్ సహకారం కూడ లభించడంతో ఈ మూవీకి బాలీవుడ్ లో కూడ భారీ క్రేజ్ తీసుకురావడానికి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఒప్పించడానికి పూరీ కరణ్ జోహార్ ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా బాక్సింగ్ నేపధ్యంలో ఉంటుంది కాబట్టి ఈ మూవీలో ఒక అతిథి పాత్ర కోసం మైక్ టైసన్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్.

మూవీ కథ రీత్యా మైక్ టైసన్ నటించే పాత్రకు కూడ ప్రాధాన్యత ఉన్న నేపధ్యంలో పూరీ ఇప్పటికే మైక్ టైసన్ ను సంప్రదించడమే కాకుండా ఎదో విధంగా అతడిని ఒప్పించదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇంకా మైక్ టైసన్ నుండి స్పందన రాలేదు అని అంటున్నారు. 

సినిమా ద్వారా విజయ్ దేవరకొండకు నేషనల్ స్టార్ ఇమేజ్ తీసుకు రావడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు పూరీ చేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ కు బాలీవుడ్ మీడియాలో క్రేజ్ ఏర్పడటంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి భారీ ఆఫర్లు వస్తున్న నేపధ్యంలో అన్నీ అనుకున్నట్లుగా జరిగి పూరీ లేటెస్ట్ మూవీలో జాహ్నవీ కపూర్ తో పాటు మైక్ టైసన్ కూడ చేతులు కలిపితే ఈ మూవీకి జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడి అత్యంత భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: