గత కొన్నేళ్లుగా సక్సెస్ ని చూడని యంగ్ హీరో నితిన్‌...తిసిన ప్రతి సినిమాలు ఆశించినంత విజయం సాధించలేదు.. ఇప్పుడు భీష్మ సినిమాతో మంచి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.. హీరో నితిన్, రష్మిక మందాన్న జంటగా నటిస్తోన్న చిత్రం భీష్మ. ఇప్పటికే టీజర్స్, ఫస్ట్ గ్లింప్స్, పాటలు అంటూ ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది భీష్మ యూనిట్.

 

గత కొన్నేళ్లుగా సక్సెస్ రుచి చూడని హీరో నితిన్‌కు భీష్మతో హిట్టు లభించేలానే కనిపిస్తోంది... ఛలో లాంటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల చేస్తోన్న రెండో ప్రయత్నమే భీష్మ. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. భీష్మ’కు సంబంధించిన పోస్టర్లను చుస్తే మతిపోతుంది... మాస్‌, క్లాస్‌, లవ్‌‌, రొమాన్స్‌ షేడ్స్‌ కనిపించేలా ఉన్న పోస్టర్లు నెటిజన్లను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్‌ రష్మిక మరోసారి కుర్రకారును పిచ్చెక్కించడం ఖాయమని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అఆ తర్వాత భీష్మతో నితిన్‌ సూపర్‌ హిట్‌ అందుకోవడం ఖాయమని మరికొంత మంది కామెంట్‌ చేస్తున్నారు. 

 

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయిందంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు నితిన్.భీష్మ మూవీ షూటింగ్ పూర్తైంది. ఓ వైపు సంతోషంగానే ఉన్నా మరో వైపు బాధగా ఉంది. అయినా ఇది చివరిది కాదు. మళ్లీ మనమందరం కలిసి పని చేస్తాము..ఇలాంటి హాస్య ప్రధాన చిత్రంలో నేను భాగమైనందుకు గర్వంగా ఉంది.

 

వెంకీ కుడుముల "ఐ లవ్ యూ" మ్యాన్.. నీ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.. అవి చాలా చిన్నవి అవుతాయి.. భీష్మ కోసం నన్ను తీసుకున్నందుకు థ్యాంక్స్. రష్మిక.. నువ్వు నా ఫేవరేట్. నీ సపోర్ట్‌కు, హార్డ్ వర్క్‌కు థ్యాంక్స్. నీతో మళ్లీ నటించాలనుంది.. ఆగలేకపోతున్నా.. త్వరలోనే మళ్లీ కలుద్దాం అంటూ ట్వీట్ చేశాడు.. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.. ఈ సినిమా తర్వాత పెళ్లి పనుల్లో బిజీ అయిపోతాడట...

మరింత సమాచారం తెలుసుకోండి: