తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి విషయంలో ముందుంటారు అనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అన్న.. రాజకీయాల్లో  ఏ పని చేయాలన్నా... సినిమా వాళ్లను ప్రోత్సహించాలన్న ఎంతో ముందుంటారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్. ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలు సినిమాలు చూస్తూ... సినిమా హీరోల నీ దర్శకులను అభినందిస్తూ ఉంటారూ. అంతేకాకుండా కొంతమంది దర్శక నిర్మాతలు కూడా తమ సినిమా చూడాలి అని కేటీఆర్ ని కోరుతూ ఉంటారు. ఇప్పటికే భరత్ అనే నేను సినిమా చూసి మహేష్ బాబు పై ప్రశంసలు కూడా కురిపించారు కేటీఆర్. మహేష్ బాబు తో ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇలా సినిమాల విషయంలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు మంత్రి కేటీఆర్. 

 

 

 అయితే తాజాగా మంత్రి కేటీఆర్ మరో సినిమా చూసారు. అదేదో పెద్ద సినిమా అనుకునేరు.. ప్రెజర్ కుక్కర్ సినిమా. కాగా  దీని పై ప్రశంసలు కురిపించారు మంత్రి కేటీఆర్. ప్రెజర్ కుక్కర్  సినిమా చాలా బాగుందని అందులో మంచి మెసేజ్ వుంది అంటూ తెలిపారు మంత్రి కేటీఆర్. శనివారం మంత్రి కేటీఆర్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాని చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ డైరెక్టర్ సుజయ్ నాకు మంచి మిత్రుడు అని తెలిపిన కేటీఆర్...  తెలంగాణ ఏర్పడిన తర్వాత బెంగళూరులో ఉంటే కలిసి పని చేద్దాం అని నేను ఇక్కడికి రమ్మని చెప్పాను అంటూ కేసీఆర్ గుర్తు చేశారు. ఫ్రెష్  ఎనర్జీతో మంచి మెసేజ్ ఉన్న చిత్రాన్ని డైరెక్టర్ సుజయ్ తెరకెక్కించాడు అంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు. 

 

 

 ప్రస్తుతం ఇప్పుడు అందరూ డాలర్ డ్రీం కోసం అమెరికాకు పరుగులు పెడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు కెటీఆర్. అదే కథని ప్రస్తుతం సుజయ్  సినిమాగా తెరకెక్కించాడు అంటూ  తెలిపారు. ఈ సినిమాలోని కంటెంట్ అందరికీ అర్థమయ్యేలా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉందని హీరో హీరోయిన్స్ నటన బాగుందని సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉంది అంటూ  కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. కాగా సినిమాలు సాయి రోనాక్ప్రీతి అస్రాన్ని జంటగా నటించారు. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చే. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో కారంపూడి క్రియేషన్స్ మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపూడి అప్పిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: