రాజ్ తరుణ్ నిజంగా తెర పై అడుగుపెట్టడం తో అతని నటన కి ఎంతో మంది ముగ్ధులయ్యారు. అయితే మొదట ఎన్నో షార్ట్ ఫిలింస్ పై అతను వర్క్ చేసాడు. . అయితే తను ఎప్పటికి అయినా తెర పై కనిపించాలి అని తను ఎంతో కష్ట పడ్డాడు. అయితే రాజ్ తరుణ్ నెమ్మది గా సినిమాల లో తన అడుగులు వేసాడు.
 
 
 
IHG
 
 
మొదట తను ఉయ్యాల జంపాల సినిమా తో ప్రేక్షకుల కి తెర పై వచ్చి పరిచయం అయ్యాడు. అదే హీరో రాజ్ తరుణ్ మొదటి సినిమా. అయితే ఆ సినిమాలో రాజ్ తరుణ్ స్లాంగ్, అవికా తో మంచి కెమిస్ట్రీ, కామిడీ ఎంతో బాగా చూపించాడు. చిన్నారి పెళ్ళి కూతురు అవికా కూడా తెలుగు ప్రేక్షకుల కి తెర పై కనిపించడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యింది. అయితే ఇలా మొత్తం గా రాజ్ తరుణ్ ఎంత గానో ఆకర్షించాడు.
 
 
విశాఖపట్నం వాస్తవ్యుడు అయిన ఈ నటుడు అనేక షార్ట్ ఫిలింస్ నుండి తెర పై సినిమాలని దక్కించుకున్నాడు. ఉయ్యాల జంపాల తరవాత సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒక్కటే ఇలా ఈ సినిమాల లో నటించాడు హీరో రాజ్ తరుణ్.
 
 
IHG
 
తమిళ చిత్రం బెలూన్ లో రాజ్ తరుణ్ గెస్ట్ రోల్ చేసాడు. అలానే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ లో కూడా అతిధి పాత్ర చేసాడు హీరో రాజ్ తరుణ్. మొదట తను మంచి సక్సెస్ ని అందుకున్నా తదుపరి హిట్స్ దక్కలేదు. కానీ నటన మాత్రం నిజంగా అద్భుతం అని ప్రేక్షకులు అంటునే ఉంటారు.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: