బుల్లితెరపై తన యాంకరింగ్ తో ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసుకుంది ఈ భామ. సుధీర్ తో జతకట్టి యు ట్యూబ్ జోడిగా ఫెమస్ అయ్యింది ఈ భామ. ఆమె ఎవరో కదండీ యాంకర్‌ రష్మి గౌతమ్‌. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సామాజిక అంశాలపై స్పందించడంతో పాటు.. మూగ జీవాల రక్షణపై ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అంతేకాకుండా తన గురించి అసభ్యంగా కామెంట్లు చేసేవారికి ధీటైన సమాధానాలు ఇస్తుంటుంది. 

 

 


ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తొలి ట్వీట్‌లో మమ్మల్ని సూపర్‌ ఉమెన్‌ చేయడం ఆపండి అని ఓ ఫొటోను షేర్‌ చేశారు. మరో ట్వీట్‌లో మాత్రం కాస్త వ్యంగ్యంగా స్పందించారు. ఓ మహిళ 8 ఏళ్ల నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్న దేశంలో.. మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. హ్యాపీ ఉమెన్స్‌ డే’ అని రష్మి ట్వీట్‌ చేశారు. ఆ మహిళా ఎవరు అనుకుంటున్నారా నిర్భయ తల్లి ఆశాదేవి. ఆమె తన కూతురుకి జరిగిన అన్యాయానికి 8 ఏళ్ల నుండి న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్న ఆ తల్లికి న్యాయం జరగలేదంటూ వ్యంగంగా పోస్ట్ ను పెట్టారు. 

 


హోలీ వస్తుంది కుక్కలపై రంగులు చల్లకండి. మనపై రంగు పడితే సబ్బుతో కడుక్కోవచ్చు. కానీ అవి ఆ పని చేయలేవు’ అని రష్మి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై ఓ నెటిజన్‌ ‘అచ్చా.. ఈద్‌ సమయంలో ట్వీట్‌ చేయండి. హోలీ, దీపావళి ఉన్నప్పుడే మన పండగల ప్రతిష్టను తగ్గించేలా మీకు ఇలాంటివి గుర్తుకువస్తాయి’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై రష్మి స్పందించారు. ఇలాంటి అర్థంలేని చెత్త కామెంట్లు చేసేటప్పుడు ఒకసారి చేసిన ట్వీట్లు అన్ని జాగ్రత్తగా చూడండి అని ఫైర్‌ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: