ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఐటెం సాంగ్స్ కామన్ అయిపోయాయి. ఐటెం సాంగ్స్ లేకపోతే ప్రేక్షకులందరూ ఏదో మిస్ అయింది అన్నట్లు గా ఫీల్ అవుతూ ఉంటారు దీంతో అటు దర్శక నిర్మాతలు కూడా సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటే సినిమాకు కాస్త కలిసొచ్చే అవకాశం ఉంది అని ఫీల్ అవుతూ  ఉన్నారు. ఇక ఈ ఐటమ్ సాంగ్ కు  సినిమాకు కలిసొచ్చే విదంగా మంచి క్రేజ్ వున్న వాళ్ళని తీసుకొచ్చి ఐటమ్స్ చేపిస్తున్నారు. ఐటమ్ సాంగ్స్ లో  అందాల ఆరబోతతో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు కూడా అదరగొడుతున్నారు. ఇలా ప్రతి సినిమాలో ఐటెం సాంగ్స్ కి మంచి గుర్తింపు కూడా వచ్చింది. అయితే కేవలం అవకాశాలు లేని హీరోయిన్లు మాత్రమే కాదు స్టార్ హీరోయిన్ గా  కొనసాగుతున్న వాళ్లు కూడా... ఐటెం సాంగ్స్ చేస్తూ అదరగొడుతున్నారు. ఐటమ్ సాంగ్స్ చేసి ఎన్నో అవకాశాలను అందుకున్న  ముద్దుగుమ్మలు కూడా చాలామంది.. 

 

 

 అయితే ఇలా ఐటమ్ సాంగ్స్ చేసిన వారిలో ఒకరు రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన అనసూయ. అప్పటివరకు అనసూయ బుల్లితెరపై యాంకర్ గా  ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారూ. ఇక ఆ తర్వాత పలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో కూడా నటించింది అనసూయ. ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన.. విన్నర్ సినిమాలో అనసూయ ఒక ఐటెం సాంగ్ లో చేసింది. అయితే అప్పుడు వరకు కొన్ని చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ బుల్లితెరపై అదరగొట్టిన అనసూయ ఒక్కసారిగా ఐటమ్ సాంగ్  చేయడంతో ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయారు.

 

 

 ఇక ఈ సినిమాలో సూయ సూయ అనసూయ అని మొదలయ్యే ఐటెం సాంగులో అదిరిపోయే పర్ఫామెన్స్ చేసిన అనసూయ స్టార్ హీరోయిన్లకు ఎక్కడ తక్కువ కాదు అంటూ నిరూపించింది. మెగా హీరోతో స్టెప్పులు వేసి దర్శకనిర్మాతలు అందరిని ఆకర్షించింది అనసూయ. ఇక ఈ సినిమా తర్వాత అనసూయకు సినిమాల్లో బాగానే అవకాశాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఐటం గర్ల్ గా  చేశాక పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఆ తర్వాత సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో ఏకంగా సినిమాలోని కీలక పాత్ర ఆయన రంగమ్మత్త పాత్రలో నటించి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు  రంగమ్మత్త గా మంచి పేరు సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: