ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమా తో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. దానికి తోడు మెగా ఫ్యామిలీ సపోర్టు ఉండటం... నిర్మాత అల్లు అరవింద్ అండగా నిలవడంతో అల్లు అర్జున్ అంచెలంచెలుగా ఎదిగి పోయాడు. ఏకంగా ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా... ప్రేక్షకులందరికీ కేరాఫ్ స్టైల్ గా మారిపోయాడు. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన అల్లు అర్జున్ ఎన్నో బ్లాక్ బస్టర్  విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న అల వైకుంఠ పురములో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అల్లు అర్జున్. 

 

 

 ఇకపోతే అల్లు అర్జున్ ఎప్పుడు సైలెంట్ గా ఉండడు  అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ... సరదాగా ఉంటాడు. అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నా ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు. ఇక సినిమాల్లో అయితే చెప్పాల్సిన పనిలేదు. తనదైన మార్కు కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు అల్లు అర్జున్. మరోవైపు యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదరగొడుతున్నాడు. ఇక డాన్స్ విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ అలా నడుచుకుంటూ వచ్చిన అది ఎంతో స్టైల్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే మామూలుగా హీరో వాళ్ళ బర్త్ డే  లు ఎంతో స్పెషల్ గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే అల్లు అర్జున్ కి కూడా తన బర్త్ డే  తన లైఫ్ లో ఎంతో స్పెషల్ అని చెప్పాడు. కానీ చిన్నప్పటి నుంచే తన పుట్టినరోజు కంటే ఇంకొకటి కూడా ఎంతో స్పెషల్ ఉంది అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 8న తన బర్త్ డే  జరుపుకుంటారు. ఇక అంతకుముందే ఫిబ్రవరిలో కూడా ఇంకో స్పెషల్ డే ని సెలబ్రేట్ చేసుకుంటాడట అల్లు అర్జున్. ఆరోజు తన బర్తడే కంటే ఎక్కువ స్పెషల్ అని చెబుతున్నాడు. ఇంతకీ ఆ రోజు ఏమిటి అనుకుంటున్నారా ప్రపంచ ప్రేమికులు  అందరికీ ఇష్టమైన రోజు అయినా వాలెంటైన్స్ డే. తన బర్తడే కంటే వాలెంటైన్స్ డే రోజున మరింత స్పెషల్ గా జరుపుకుంటాను  అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: