సూపర్ స్టార్ మహేష్ బాబు అవకాశం ఇస్తే చాలు అంటూ అనేక టాప్ హీరోయిన్స్ క్యూ కడుతున్న పరిస్థితులలో అనుష్క ఏరికోరి ఇప్పుడు మహేష్ కు అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. అయితే ఈ మహేష్ సూపర్ స్టార్ మహేష్ కాడు. ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడో మర్చిపోయిన దర్శకుడు మహేష్. 


2014వ సంవత్సరంలో సందీప్ కిషన్ రెజీనా లతో తీసిన ‘రారా కృష్ణయ్య’ మూవీ డైరెక్టర్మహేష్ అని తెలుస్తోంది. ఈ మూవీ అప్పట్లో ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో కనీసం ఇతను చెప్పే కథలను వినడానికి ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. దీనితో అతడిని ఇండస్ట్రీ పూర్తిగా మారిచిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య అతడు అనుష్క ను కలిసి ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కథను చెప్పినట్లు సమాచారం. 


ఈ కథ అనుష్కకు బాగా నచ్చడంతో ఆమె వెంటనే ఈ కథకు ఓకె చెప్పడమే కాకుండా ఈ మూవీ స్టోరీని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు అనుష్క రిఫర్ చేసింది అని అంటున్నారు. అనుష్క ఎవరికీ డేట్స్ ఇవ్వని పరిస్థితులు ఉన్న నేపధ్యంలో అనుష్క కు బాగా నచ్చే విధంగా ఈ ఫెయిల్యూర్ డైరెక్టర్ ఏమి చెప్పి స్వీటిని ఒప్పించాడు అంటూ ఇండస్ట్రీలో  చాలామంది ఆశ్చర్య పోతున్నారు. 


ఈ మధ్య జరిగిన తన 15 సంవత్సరాల సినీ ప్రస్థాన ఈవెంట్ లో పాల్గొనడానికి అనుష్క హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెతో ఇంటర్వ్యూ చేయాలని కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రయత్నించినప్పుడు ఆ మీడియా సంస్థలకు అనుష్క ఒక షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. తనకు వరసపెట్టి మీడియా సంస్థలు పెళ్ళిళ్ళు చేసే బదులు ఆ మీడియా సంస్థలు పేదింటి అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేస్తే తాను కూడ తనవంతు సహకారం అందిస్తాను అంటూ చెప్పినట్లు టాక్. దీనితో అనుష్క తన పెళ్ళి పై లేటెస్ట్ గా వచ్చిన వార్తలను విని ఆమె ఎంత అసహనానికి గురైందో అర్ధం అవుతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: