ప్రస్తుతం హైదరాబాద్ నగరం అంతా కరోనా భయాలతో లాక్ డౌన్ లో ఉండటంతో పవన్ తన ఫామ్ హౌస్ లో సేద తీరుతూ అక్కడ తనకు ఇష్టమైన మొక్కలు జంతువులతో కాలం గడుపుతూ మధ్యలో తనకు ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటున్నాడు. ఈ పరిస్థితుల నేపధ్యంలో పవన్ లేటెస్ట్ గా తన సినిమాలకు సంబంధించి న చర్చలను జరపడానికి దర్శకుడు వేణు శ్రీరామ్ క్రిష్ లతో విడివిడిగా సమావేశం అయినట్లు టాక్.


ఇప్పటి వరకు ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించిన ప్రోగ్రస్ ను వేణు శ్రీరామ్ వద్ద తెలుసుకుంటే క్రిష్ కు అతడు తీస్తున్న పీరియాడిక్ మూవీ గురించి వివరాలు సేకరించడమే కాకుండా ఈ మూవీకి సంబంధించి పవన్ క్రిష్ కు క్లాస్ పీకినట్లు టాక్. క్రిష్ ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా తీస్తున్న నేపధ్యంలో అలాంటి ప్రయోగం చేయవద్దని అనవసరంగా ఈ మూవీ బడ్జెట్ పెంచి తరువాత మార్కెటింగ్ సమస్యలు తీసుకు రావద్దని చెపుతూ స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 


అంతేకాదు చిరంజీవి నటించిన ‘సైరా’ ఇలాగే పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తీసినష్టాలు కొని తెచ్చుకున్న పరిస్థితులలో అలాంటి పరిస్థితి మళ్ళీ తన మూవీ ప్రాజెక్ట్ కు వచ్చే విధంగా వ్యహరించ వద్దని పవన్ క్రిష్ కు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు కరోనా ప్రభావం తగ్గిన తరువాత తిరిగి షూటింగ్ ప్రారంభం అయిన తరువాత తాను క్రిష్ మూవీకి ఇచ్చిన డేట్స్ అన్నీ ‘వకీల్ సాబ్’ నిర్మాతలకు ఎడ్జెస్ట్ చేయమని కోరినట్లు తెలుస్తోంది. 


దీనితో క్రిష్ పవన్ మూవీ పై పెట్టుకున్న పాన్ ఇండియా ఆశలు ఆవిరి అయిపోవడమే కాకుండా ఈ మూవీ అనుకున్న భారీ బడ్జెట్ లో తీయలేకపోతే క్వాలిటీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అన్న విషయం తనకు తెలిసినా పవన్ ముందు చెప్పలేక క్రిష్ చాల అంతర్మధనంలో ఉన్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: