రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫిలిం మేకర్స్ విడుదల చేసిన చరణ్ పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోకు అనూహ్య స్పందన రావడంతో చరణ్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు. ఒక నిముషం 13 సెకండ్లు ఉన్న ఈ వీడియో మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. 


స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అదిరిపోయాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రామ్ చరణ్ తన పాత్రలో ఒదిగిపోయినతీరు రాజమౌళి విజువల్స్ వీడియో కట్ కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం అంటూ అందరి ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ ఫక్తు తెలంగాణ యాసలో ఇచ్చిన వాయస్ ఓవర్ చరణ్ అల్లూరి పాత్రను విపరీతంగా ఎలివేట్ చేసింది. 


ఇప్పుడు మే 20న జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన వీడియోను రామ్ చరణ్ వాయస్ ఓవర్ తో తారక్ పుట్టినరోజునాడు విడుదలచేయబోతున్నారు. దీనితో చరణ్ వీడియోకు వచ్చిన స్థాయిలో అద్భుత స్పందన జూనియర్ పాత్రకు సంబంధించిన వీడియోకు కూడా రావాలి అంటే రామ్ చరణ్ జూనియర్ స్థాయిలో అద్భుతంగా ఆ వీడియోకు కూడ వాయస్ ఓవర్ చెప్పవలసి ఉంటుంది. 


జూనియర్ చరణ్ పాత్రను పరిచయం చేస్తూ చెప్పిన వాయస్ ఓవర్ తెలుగు తమిళం కన్నడ హిందీ భాషలలో ఇచ్చాడు. కేవలం మలయాళ వెర్షన్ కు మాత్రమే జూనియర్ డబ్బింగ్ చెప్పలేదు. తారక్ తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా డిక్షన్ మరియు వాయిస్ మాడ్యులేషన్‌లో తనకు తానే సాటి అని నిరూపించాడు. ఒక భాష, రెండు భాషలు అనుకుంటే వేరు ఏకంగా నాలుగు భాషలలో సమానంగా అంతే అద్భుతంగా చెప్పి మెప్పించడంతో అదే స్థాయిలో ఇప్పుడు జూనియర్ పాత్రకు సంబంధించిన వీడియోకు చరణ్ డబ్బింగ్ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనితో జూనియర్ స్థాయిలో చరణ్ నాలుగు భాషలలో డబ్బింగ్ చెప్పి మెప్పించగలడా అంటూ జూనియర్ అభిమానులు చరణ్ అభిమానులకు ప్రశ్నలు వేస్తున్నారు. ఒక విధంగా ఆలోచిస్తే జూనియర్ పెట్టే పరీక్షలకు నేగ్గికు రావడం చరణ్ కు అంతసులువైన పని కాదు అంటూ కొందరి అభిప్రాయం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: