తెలుగు చిత్ర పరిశ్రమలో పంచ్ డైలాగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే హీరో బాలకృష్ణ. బాలకృష్ణ ఏ సినిమాలో నటించిన ఏ దర్శకుడి తో సినిమా చేసిన .. ఏ పాత్రలో నటించిన ప్రతి డైలాగ్ పంచ్ డైలాగ్ ల మారిపోతూ ఉంటుంది. పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తూ ఉంటారు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ హీరోగా పరిచయం అయిన నాటి నుంచి నేటి వరకు... బాలకృష్ణ హీరోగా నటించిన ప్రతి సినిమా పంచ్ డైలాగులకు కేరాఫ్ అడ్రెస్  అని చెప్పాలి. ప్రతి సినిమాలో ఎన్నో పంచ్ డైలాగులు ఉంటాయి . ఇలా ప్రేక్షకులకు ఎవర్గ్రీన్ గా  నిలిచిన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లు ఎన్నో. 

 

 ఇలా బాలకృష్ణ చాలా సినిమాల్లో పంచ్ డైలాగులు చెప్పినప్పటికీ... దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన బాలకృష్ణ హీరోగా నటించిన సింహా సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ పంచ్ డైలాగులు మాత్రం ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎవర్గ్రీన్ గా  నిలిచాయి అనే చెప్పాలి. ముఖ్యంగా బాలకృష్ణ రౌద్రం గా చెప్పిన  ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను హోరెత్తింది అనే చెప్పాలి. సినిమా చూస్తున్నప్పుడు ఈ డైలాగ్ బాలకృష్ణ చెబుతుంటే ఈలలు గోలలలో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. 

 


 ఆ తర్వాత ఈ డైలాగ్ కాస్త ట్రెండింగ్ గా మారిపోయింది. మామూలుగానే హీరోలు చెప్పే పవర్ ఫుల్ పంచ్ డైలాగులను వేరే సినిమాలు పేరడీలు గా మారుతూ ప్రేక్షకులకు కామెడీని పంచుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా సింహా సినిమాలో బాలకృష్ణ ఎంతో పవర్ఫుల్ గా చెప్పిన ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అనే పంచ్  డైలాగ్ ని ఎన్నో సినిమాల్లో పేరడీగా మార్చి  ప్రేక్షకులు అందరికీ నవ్వించారు చాలా మంది దర్శకులు . ఇక సింహ సినిమా విడుదలైన తర్వాత ఈ డైలాగ్ వింటూ  ప్రేక్షకులందరూ ఎన్నో రోజుల పాటు... ఈ డైలాగ్ పలుమార్లు చెబుతూ ఉండడం కూడా చేశారు. ఇలా బాలకృష్ణ సింహా సినిమాలో చెప్పిన డైలాగ్ ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ పంచ్ డైలాగ్ గా  మిగిలిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: