స్టార్ హీరోగా, జనసేన పార్టీ అధినేతగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తనకు పుస్తకాలు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. తన జీవితంలో రెండు లక్షల పుస్తకాలు చదివానని పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఒక ఇంటర్యూలో పవన్ మాట్లాడుతూ తాను ఇంటర్ ఫెయిల్ అయిన తరువాత ఇంట్లో ఒక గదికే పరిమితమయ్యానని అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పారు. 
 
పవన్ కళ్యాణ్ సన్నిహితులు కూడా పవన్ కు పుస్తకాలు అంటే ఎంతో ఇష్టమని చెబుతూ ఉంటారు. పవన్ వ్యక్తిగత లైబ్రరీలో కూడా వేల సంఖ్యలో పుస్తకాలు ఉంటాయని సమాచారం. పలు ప్రాంతాల్లో పవన్ పిల్లలకు పెద్ద బాలశిక్ష పుస్తకాలను అందించారు. పుస్తకాలపై ఎంతో ఇష్టం ఉన్న పవన్ ఈరోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా మారవి వెంకయ్య రచించిన భాస్కర శతక పద్యాన్ని పోస్ట్ చేశారు. 
 
"ధనం గల వాడికి నీవు చేసే సహాయం వల్ల ప్రయోజనం ఉండదు. ఆ మేలు నువ్వు చేసినా, చేయకపోయినా వాడు క్షేమంగానే ఉంటాడు. సాయం కోసం ఎదురుచూసే పేదవానికి మేలు చేస్తే సుఖపడతాడు. మేఘుడు వాడిన చేల మీద వర్షిస్తే పంటలు పండుతాయి కానీ సముద్రంలో కురిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి...? ఈ విషయాలను గుర్తుంచుకుని అవసరం ఉన్నవాళ్లకు మాత్రమే మేలు చేయాలి" అనే అర్థం వచ్చే పద్యాన్ని పోస్ట్ చేశారు. 


 
పుస్తకాలు అంటే ఎంతో అభిరుచి ఉన్న పవన్ ఈరోజు వరల్డ్ బుక్ డే సందర్భంగా పద్యాన్ని పోస్ట్ చేశారు. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఆర్థిక అవసరాల దృష్ట్యా పవన్ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో పవన్ నటిస్తున్నారు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ అనంతరం గ్యాప్ లేకుండా షూటింగ్ జరగనుందని సమాచారం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: