అక్కినేని వారి కోడలు నాగచైతన్య సమంత టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి దశాబ్దకాలం దాటిపోతున్నా ఇప్పటికీ ఈ అమ్మడికి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. కేవలం ఒక స్టార్ హీరోయిన్ గానే కాకుండా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అంతేకాకుండా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సమంత. ఇక ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మతి పోగొట్టింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ మొదటినుంచి స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది సమంత. సమంత కెరీర్ మొత్తం స్టార్ హీరోయిన్ గానే  గడిచింది. 

 

 

 అయితే సమంతా దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరు  హీరోలతో నటించింది  చెప్పాలి. ఇక సమంత నటించిన అన్ని సినిమాలు దాదాపుగా మంచి విషయాలను అందుకున్నాయి. ఎందుకంటే కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసిన సమంత మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో మాత్రమే నటించింది. అందుకే అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి  అని చెప్పాలి. అయితే సమంత జోడి ఒక హీరోకి మాత్రం అంతగా కలిసి రాలేనట్లు కనిపిస్తోంది. ఆ హీరో ఎవరో కాదు యూత్ లో బాగా క్రేజ్ తెచ్చుకుని ప్రస్తుతం యువ హీరోల్లో మొదటి స్థానంలో దూసుకుపోతున్న శర్వానంద్. 

 

 

 తాజాగా శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా తమిళ సూపర్ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది అని చెప్పాలి. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం బోల్తా కొట్టింది. సమంత నటన పరంగా అదరగొట్టినప్పటికీ...  శర్వానంద్ తన పాత్రలో జీవించి మరి నటించినప్పటికీ ఈ సినిమా ఎందుకో  ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా ఇద్దరికీ నిరాశే మిగిల్చింది అని చెప్పాలి. కాగా ఇప్పటివరకు అందరు హీరోలకు జోడిగా నటించిన సమంత అందరికీ బాగానే కలిసొచ్చి మంచి విజయాలను అందించింది.  కానీ మొదటిసారి సమంత జోడి ఎందుకో  శర్వానంద్ కు  బెడిసి కొట్టింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: