తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగి తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించిన  హీరోయిన్లలో ఒకరు జయసుధ. జయసుధను సహజనటి అంటూ ఉంటారు. ఎందుకంటే పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పెట్టి  పాత్రలో నటిస్తోంది. అలాంటి గొప్ప నటి అయిన జయసుధ ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే జయసుధ  స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో కేవలం నటనతోనే కాదు తన అందం అభినయంతో కూడా ఎంతో మంది దర్శక నిర్మాతలను ఆకర్షించింది. దాదాపుగా అందరు హీరోల సరసన నటించింది జయసుధ. అప్పట్లో తన అందం అభినయం ముందు ఏ హీరోయిన్ సాటి రాలేదు అనే చెప్పాలి. 

 

 

 దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జయసుధ.. అందరు  హీరోల సరసన నటించి ఎంతో  గుర్తింపు సంపాదించింది . ఒకప్పుడు హీరోయిన్గా తన అందం అభినయంతో ఆకట్టుకున్న జయసుధ ఆ తర్వాత అమ్మ గా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న యువ హీరోలకు అమ్మగా అమ్మగా నానమ్మగా ... ఇలా  మరోసారి తన అభినయంతో ఆకట్టుకుంది జయసుధ. తెలుగుతనం ఉట్టిపడే ఈ విధంగా మరోసారి తెలుగు ప్రజలకు విలువలు గుర్తుచేసే విధంగా జయసుధ నటించే పాత్రలు... జయసుధ వేషధారణ ఉంటాయి. 

 

 

 అందుకే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగి  తన అందం అభినయంతో ఎంతో గొప్ప అందగత్తె గా పేరు తెచ్చుకున్న జయసుధ ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు ఒక అమ్మగా  ఒక గొప్ప అందగత్తె అని చెప్పాలి. తెలుగుతనాన్ని మరోసారి ప్రేక్షకులందరికీ గుర్తు చేస్తూ తన పాత్రల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది జయసుధ. ప్రస్తుతం జయసుధ పాత్రలను చూస్తుంటే స్వయంగా మన ఇంట్లో వాళ్ళను చూస్తున్నట్లుగా ఉండేలా పాత్రల్లో ఒదిగిపోయి నటిస్తూ.. ఇప్పటికి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది జయసుధ. అందుకే జయసుధ అప్పుడే కాదు ఇప్పటికీ గొప్ప అందగత్తె.

మరింత సమాచారం తెలుసుకోండి: