తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వానికి రెండు మూడు నెలల వరకు థియేటర్లు ఓపెన్ చేసే ఉద్దేశం లేదని లీకులు ఇవ్వడంతో ఇక ఇప్పట్లో ధియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దీనితో కనీసం సినిమాలకు సంబంధించి అదేవిధంగా ఛానల్స్ కు సంబంధించి షూటింగ్ లను మొదలుపెట్టుకునే అవకాశం అయినా ఇప్పించమని సినిమా ఇండస్ట్రీ వర్గాలు ప్రభుత్వాలతో తమ రాయబారాలు కొనసాగిస్తున్నాయి.


అయితే ఈ రాయబారాలకు స్పందిస్తున్న ప్రభుత్వాలు కొన్ని షరతులు పెట్టే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు షూటింగ్ ప్రారంభమయ్యే ముందు నిర్మాత సినిమాకు పనిచేసే వారందరికి కరోనావైరస్ నెగటివ్ సర్టిఫికేట్ లను ఇవ్వడమే కాకుండా పదిహేను రోజులకు ఒకసారి ఇలాంటి ఇటువంటి సర్టిఫికెట్ లను షూటింగ్ కొనసాగుతున్నంత సేపు ఇవ్వాలని తెలుస్తోంది.


అంతేకాదు ఒక సీరియల్ కు సంబంధించి అదేవిధంగా ఒక సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలుపెట్టే ముందు ఆయూనిట్ లోని లైట్ బాయ్ నుండి నటీనటుల వరకు ఎవరికి కరోనా వచ్చి చనిపోయినా వారికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఆ సినిమాలు లేదా సీరియల్స్ తీసే నిర్మాతలు ఇవ్వవలసి ఉంటుందని దీనికితోడు షూటింగులకు పర్మిషన్ ఇచ్చే ముందే నిర్మాతలు కోటి రూపాయిలు స్థానిక కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని అనే కఠిన నిబంధనలు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈనిబంధనలు అనుసరించి సీరియల్స్ సినిమాలు తీయడం కష్టం అనీ అనేకమంది నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్. తీనితో కనీసం ప్రభుత్వాలు పోస్టు ప్రొడక్షన్ పనులకైనా పర్మిషన్ ఇమ్మని ఇప్పటికే టాలీవుడ్ లో కనీసం 60 సినిమాలు పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నపరిస్థితులలో ఈచిన్న పనులకు అయినా ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వాలని  కోరుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా నిర్మాత సురేశ్ బాబు ఒకమీడియా సంస్థతో మాట్లాడుతూ భవిష్యత్ లో జనం ధియేటర్స్ వైపు రావాలి అంటే సినిమాలను ప్రమోట్ చేయడానికి స్టార్స్ ధియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులతో మాట్లాడుతూ సరదాగా తమ సినిమాలను ప్రమోట్ చేయాలని అదేవిధంగా కోవిడ్ -19 తరువాత తిరిగి ఓపెన్ అయ్యే ధియేటర్లలో పిల్లలకు కిడ్స్ జోన్ తో పాటు మందు ప్రియులకు బీర్ ను కూడ ధియేటర్లలో అందుబాటులో ఉంచాలని అదేవిధంగా ఫ్యామిలీలకు సెపరేట్ సీటింగ్ వసతులు ఏర్పాటు చేసేవిధంగా ధియేటర్లను సమాలంగా మార్చకపోతే భవిష్యత్ లో జనం ధియేటర్స్ కు రారు అంటూ సురేశ్ బాబు చెపుతున్న మాటలతో అటు షూటింగ్ లు ఇటు ధియేటర్ల ప్రారంభం పూర్తి అయోమయంలో పడిపోతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: